ఎల్‌ఐసీలో అప్రెంటిస్ డెవలప్‌మెంట్ ఆఫీసర్ (ADO) పోస్టుల భర్తీకి ఏప్రిల్ 23న నిర్వహించిన మెయిన్ పరీక్ష ఫలితాలను లైఫ్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా విడుదల చేసింది. జోన్లవారీగా ఫలితాలను అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. ఏడీవో ప్రధాన పరీక్షకు హాజరైన అభ్యర్థులు తమ ఫలితాలను వెబ్‌సైట్‌లో చూసుకోవచ్చు. పీడీఎఫ్ రూపంలో మెయిన్ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థుల వివరాలు అందుబాటులో ఉన్నాయి. అంతకు ముందు మార్చి 12న ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే.
లైఫ్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(ఎల్ఐసీ) దేశవ్యాప్తంగా ఉన్న కార్యాలయాల్లో 9394 అప్రెంటిస్ డెవలప్‌మెంట్ ఆఫీసర్(ఏడీఓ) పోస్టుల భర్తీకి ఈ ఏడాది జనవరిలో జోన్లవారీగా నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. అభ్యర్థుల నుంచి జనవరి 21 నుంచి ఫిబ్రవరి 10 వరకు దరఖాస్తులు స్వీకరించింది. సెంట్రల్ జోన్, నార్తర్న్ జోన్, వెస్ట్రర్న్ జోన్, ఈస్ట్రర్న్ జోన్, సదరన్ జోన్, నార్త్ సెంట్రల్ జోన్, సౌత్ సెంట్రల్ జోన్, ఈస్ట్ సెంట్రల్ జోన్ పరిధిలో మొత్తం 9394 ఏడీవో పోస్టులను ఎల్ఐసీ భర్తీ చేయనుంది.
0 comments:
Post a Comment