AP Group 1, 2 Notification : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు. గ్రూప్-1, గ్రూప్-2 నోటిషికేషన్లకు ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. నిరుద్యోగుల్లో ఆశలు చిగురించేలా.. త్వరలో గ్రూప్ 1, 2 నోటిఫికేషన్లు విడుదల చేయాలని అధికారులను ఆదేశించారు. అతి త్వరలో నోటిఫికేషన్లు విడుదల కానున్నాయి. దాదాపు వెయ్యికి పైగా పోస్టులు భర్తీ చేసే అవకాశం ఉంది.
కాగా.. బుధవారం ఉదయం ఈ పోస్టుల భర్తీపై అధికారులు ముఖ్యమంత్రికి వివరాలు అందించారు. సీఎం ఆదేశాల మేరకు ఈ పోస్టుల భర్తీ ప్రక్రియ చురుగ్గా సాగుతోందని అధికారులు వెల్లడించారు. ప్రభుత్వంలోని వివిధ శాఖల నుంచి ఖాళీల వివరాలు తెప్పించుకున్నామని వెల్లడించారు. నోటిఫికేషన్ జారీకి అవసరమైన కసరత్తు తుదిదశలో ఉందని తెలిపారు.
గ్రూప్-1కి సంబంధించి సుమారు 100కిపైగా పోస్టులు, గ్రూప్-2కు సంబంధించి సుమారు 900కిపైగా పోస్టులు, మొత్తంగా 1000కిపైగా పోస్టులు భర్తీచేయనున్నామని తెలిపారు. వీలైనంత త్వరలో దీనికి సంబంధించి నోటిఫికేషన్ జారీచేయాలని సీఎం ఆదేశించారని. పరీక్షల నిర్వహణ, ఫలితాలు వెల్లడి తదితర అంశాలపైనా దృష్టిసారించాలని ముఖ్యమంత్రి ఆదేశించారని వెల్లడించారు.
0 comments:
Post a Comment