DRDO RAC Recruitment 2023 : ఢిల్లీలోని డిఫెన్స్ రిసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (DRDO) ఆధ్వర్యంలోని రిక్రూట్‌మెంట్ అండ్ అసెస్‌మెంట్ సెంటర్(ఆర్‌ఏసీ).. జాబ్ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా 181 సైంటిస్ట్-బీ పోస్టులను భర్తీ చేయనున్నారు. సంబంధిత స్పెషలైజేషన్‌లో బ్యాచిలర్స్ డిగ్రీ/ ఇంజినీరింగ్ డిగ్రీ/ మాస్టర్స్‌డిగ్రీ ఉత్తీర్ణత ఉన్న వాళ్లు అర్హులు. గేట్ స్కోర్, షార్ట్‌లిస్టింగ్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది. అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
వివరాల్లోకెళ్తే..
మొత్తం ఖాళీలు: 181
అన్ రిజర్వ్‌డ్: 73
ఈడబ్ల్యూఎస్: 18
ఓబీసీ: 49
ఎస్సీ: 28
ఎస్టీ: 13
ముఖ్య సమాచారం:
విభాగాలు: ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్, మెకానికల్ ఇంజినీరింగ్, కంప్యూటర్ సైన్స్ & ఇంజినీర్, ఎలక్ట్రికల్ ఇంజినీర్, మెటీరియల్ ఇంజినీరింగ్, మెటీరియల్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్, మెటలర్జికల్ ఇంజినీరింగ్, భౌతికశాస్త్రం, రసాయన శాస్త్రం, కెమికల్ ప్లాంట్ ఇంజినీరింగ్, అప్లైడ్ కెమికల్ అండ్ పాలిమర్ టెక్నాలజీ, పాలిమర్ సైన్స్ అండ్ కెమికల్ టెక్నాలజీ, సివిల్ అండ్ స్ట్రక్చరల్ ఇంజినీర్, సివిల్ అండ్ ఎన్విరాన్‌మెంటల్ ఇంజినీర్ తదితర విభాగాల్లో ఈ ఖాళీలున్నాయి.
అర్హత: సంబంధిత స్పెషలైజేషన్‌లో బ్యాచిలర్స్ డిగ్రీ/ ఇంజినీరింగ్ డిగ్రీ/ మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణత ఉండాలి. అలాగే గేట్ పరీక్షలో అర్హత సాధించాలి.
వయసు: యూఆర్/ ఈడబ్ల్యూఎస్-28, ఓబీసీ-31, ఎస్సీ/ ఎస్టీ అభ్యర్థులు 33 ఏళ్లు మించకూడదు.
జీతభత్యాలు: నెలకు రూ.1లక్ష వరకు చెల్లిస్తారు.
ఎంపిక విధానం: గేట్ స్కోర్‌ను అనుసరించి స్క్రీనింగ్/ షార్ట్‌లిస్టింగ్ చేస్తారు. అనంతరం ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది.
దరఖాస్తు ఫీజు: రూ.100.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు చివరి తేది: ఉద్యోగ ప్రకటన వెలువడిన 21 రోజుల్లోపు దరఖాస్తు చేసుకోవాలి.
Job Notification Whatsapp Group:
Job Notification Telegram Group:
పూర్తి వివరాలకు వెబ్‌సైట్:https://rac.gov.in/
0 comments:
Post a Comment