దేశవ్యాప్తంగా ఉన్న కేంద్రీయ విద్యాలయ సంగఠన్(KVS)లో పలు పోస్టుల భర్తీకి ఇటీవల నోటిఫికేషన్(Notification) జారీ అయింది. ఈ రిక్రూట్‌మెంట్ ద్వారా మొత్తంగా 13 వేలకు పైగా ఫోస్టులను భర్తీ చేయనున్నారు. ఇందుకు రిజిస్ట్రేషన్ ప్రక్రియ డిసెంబర్ 05, 2022 నుంచి ప్రారంభం కాగా.. జనవరి 05తో ముగిసింది. దీని ద్వారా టీజీటీ, పీజీటీ, పీఆర్‌టీ వంటి టీచింగ్, నాన్ టీచింగ్(Non Teaching) పోస్టులను భర్తీ చేయనున్నారు. అయితే వీటికి సంబంధించి ఆన్లైన్ పరీక్షలను ఫిబ్రవరి 12 నుంచి మార్చి 13 వరకు నిర్వహించారు. అయితే ఈ పరీక్షలకు సంబంధించి ప్రాథమిక కీతో పాటు.. ఓఎంఆర్ పత్రాలను కూడా విడదుల చేశారు. పూర్తి వివరాలు తెలుసుకోండి.
ఇటీవల నిర్వహించిన లైబ్రేరియన్, ఏఎస్ఓ, ఎస్ఎస్ఏ, స్టెనో 2, జేఎస్ఏ అండ్ పీఆర్టీ (రీ ఎగ్జామ్) పరీక్షలకు సంబంధించి ఓఎమ్ఆర్ తో పాటు.. పరీక్ష కీని డౌన్ లోడ్ చేసుకోవచ్చని కేవీఎస్ అధికారికంగా ప్రకటించింది. ఈ పరీక్షలను కేవీఎస్ మార్చి 1 నుంచి మార్చి 13వరకు నిర్వహించింది.
డౌన్ లోడ్ ఇలా..
ముందుగా అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ను సదర్శించండి.
-తర్వాత వెబ్ సైట్ లో స్క్రోల్ అవుతున్న.. నోటీస్ లో ఓఎమ్ఆర్ డౌన్లోడ్ అనే ఆప్షన్ పై క్లిక్ ఇవ్వండి. దాని కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.
తర్వాత మీ వివరాలను నమోదు చేసి.. ఓఎంఆర్ తో పాటు.. ప్రాథమిక కీని డౌన్లోడ్ చేసుకోండి.
-మీ పరీక్ష మార్కులను తెలుసుకొని.. ఏమైన అభ్యంతరాలుంటే.. ఛాలెంజ్ చేసుకోవచ్చు.
దీని కొరకు అభ్యర్థులు ఒక్కో ప్రశ్నకు రూ.1000 చెల్లించాల్సి ఉంటుంది. ఆ ప్రశ్నకు మీరు చెప్పిన సమాధానం కరెక్ట్ అయితే.. ఆ డబ్బులు మీకు రిఫండ్ ఇచ్చేస్తారు. ఈ అబ్జెక్షన్లకు సంబంధించి లింక్ మార్చి 20వ తేదీ నుంచి అందుబాటులో ఉంటుందని కేవీఎస్ ప్రకటించింది.
వివిధ రకాల ఉద్యోగ నోటిఫికేషన్ కావలసిన క్రింది వాట్సాప్ గ్రూప్ లో చేరండి...
Telegram Group: https://t.me/apjobs9
0 comments:
Post a Comment