UPSC Civil Services 2023 : డిగ్రీ పాసైన వాళ్లకు 1105 ప్రభుత్వ ఉద్యోగాలు.. నోటిఫికేషన్‌ విడుదల

UPSC CSE 2023 notification : యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) సివిల్ సర్వీసెస్‌ ఎగ్జామినేషన్‌ (CSE) 2023 నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ ద్వారా వివిధ సివిల్ సర్వీసులకు చెందిన 1105 ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థు నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు ఏదైనా డిగ్రీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్న అభ్యర్ధులు కూడా అర్హులే. వివరాల్లోకెళ్తే..
సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్- 2023
మొత్తం ఖాళీలు: 1105

అర్హతలు: అభ్యర్ధులు ఏదైనా డిగ్రీ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్న అభ్యర్ధులు కూడా అర్హులే.

వయోపరిమితి: అభ్యర్థుల వయసు 01-08-2023 నాటికి 21 ఏళ్లు నిండి ఉండాలి. అలాగే 32 ఏళ్లు మించకుండా ఉండాలి. అంటే 02-08-1991 నుంచి 01-08-2002 మధ్య జన్మించి ఉండాలి. రిజర్వ్‌డ్ కేటగిరీకి వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

అటెంప్టుల సంఖ్య: జనరల్‌కు ఆరు, ఓబీసీలు, దివ్యాంగుల(జీఎల్‌, ఈడబ్ల్యూఎస్‌, ఓబీసీ)కు తొమ్మిది సార్లు అవకాశం ఉంది. ఎస్సీ/ ఎస్టీ అభ్యర్థులకు అపరిమితం.

ఎంపిక విధానం: రాత పరీక్ష(ప్రిలిమ్స్, మెయిన్స్), ఇంటర్వ్యూ, రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.

పరీక్ష విధానం: ప్రిలిమినరీ పరీక్షలో రెండు పేపర్లుంటాయి. ఒక్కో పేపర్‌కు 2 గంటల్లో 200 మార్కులకు ఉంటుంది. ఉదయం, మధ్యాహ్నం రెండు సెషన్లలో ఈ పరీక్షలుంటాయి. రెండు పేపర్లలో ప్రశ్నలు ఆబ్జెక్టివ్ టైప్ మల్టిపుల్ ఛాయిస్ రూపంలో ఉంటాయి. రెండో పేపర్ జనరల్ స్టడీస్ క్వాలిఫైయింగ్ పేపర్‌గా ఉంటుంది. దీనిలో 33 శాతం అర్హత సాధించాల్సి ఉంటుంది. నెగెటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది. ప్రిలిమ్స్‌లో అర్హత సాధించిన అభ్యర్థులను మెయిన్స్ రాయడానికి అనుమతిస్తారు. మెయిన్స్ పరీక్షలు మొత్తం 1750 మార్కులకు ఉంటుంది. చివరిగా పర్సనాలిటీ టెస్ట్‌(ఇంటర్వ్యూ) 275 మార్కులకు ఉంటుంది. మొత్తం 2025 మార్కులకు యూపీఎస్సీ పరీక్షలు నిర్వహిస్తుంది.

దరఖాస్తు విధానం: అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు ఫీజు: ఓబీసీ/ ఇతర అభ్యర్థులకు రూ.100(ఎస్సీ/ ఎస్టీ/ పీడబ్ల్యూడీ అభ్యర్థులకు ఫీజు మినహాయింపు ఉంటుంది).

ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోని ప్రాథమిక పరీక్ష కేంద్రాలు: 
అనంతపురం, హైదరాబాద్, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, వరంగల్. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోని ప్రధాన పరీక్షా కేంద్రాలు: హైదరాబాద్, విజయవాడ.

ముఖ్యమైన తేదీలు:

దరఖాస్తులు ప్రారంభం: ఫిబ్రవరి 01, 2023
దరఖాస్తులకు చివరి తేదీ: ఫిబ్రవరి 21, 2023
దరఖాస్తు సవరణ తేదీలు: ఫిబ్రవరి 22, 2023 నుంచి ఫిబ్రవరి 28, 2023 వరకు ఉంటుంది.
ప్రిలిమ్స్ పరీక్ష తేదీ: మే 28, 2023.

పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌

పూర్తి నోటిఫికేషన్: Click Here

వివిధ రకాల కేంద్రా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్ లు కావలసినవారు క్రింది వాట్స్అప్ గ్రూప్లో చేరండి:


Job Notifications Telegram Group:

Important Job Notifications:





Indian Army : ఇండియన్ ఆర్మీలో ఎన్‌సీసీ స్పెషల్ ఎంట్రీ స్కీమ్ కోర్సులో ప్రవేశాలు


Posted in:

Related Posts

0 comments:

Post a Comment

Latest Job Notifications

Subscribe My Whatsapp & Telegram Groups More

Job Related Material

More

Bank Jobs

More
Top