Anganawadi Recruitment 2023 Notification | 115 అంగన్వాడీ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

జిల్లా మహిళా & శిశు సంక్షేమ & సాధికారితా అధికారి వారి కార్యాలయము, కడప. నోటిఫికేషన్ WDCW-ADMOAPT/9/2023-SA1-DW&CDA-KDP, తేది: 30.01.2023.

1) వై.యస్.ఆర్. కడప జిల్లా యందలి వివిధ ఐ.సి.డి.యస్. ప్రాజెక్టుల పరిదిలో ఖాళీగా యున్నటువంటి దిగువ తెలుపబడిన మరియు జతపరచబడిన (3) జాబితాల యందు పేర్కొనబడిన పోస్టుల భర్తీ కొరకు అమలులో యున్న ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారము ఎంపిక ప్రక్రియ నిర్వహించబడును.

Posts:

అంగన్వాడి కార్యకర్త (AWW) - 19

అంగన్వాడి సహాయకురాలు (AWH) - 89

మినీ అంగన్వాడీ కార్యకర్త (Mini AWW) - 07


II) ఈ పోస్టులకు అవసరమైన అర్హతలు దిగువ తెలుపబడినవి.

a) 01.07.2023వ తేదీ నాటికి అభ్యర్థులు 21 సం. దాటి 35 సం. లోపు వయ్యస్సు కలవారైయుండవలయును.

b) దరఖాస్తు చేసుకోగోరు అభ్యర్థి స్థానిక వివాహిత మహిళ అయ్యి ఉండాలి.

C) అంగన్వాడీ కార్యకర్త పోస్టు కొరకు దరఖాస్తు చేయగోరు అభ్యర్థులు 10వ తరగతి ఖచ్చితంగా  ఉత్తీర్ణులై యుండవలయును.

d) అంగన్వాడి సహాయకురాలు & మినీ అంగన్వాడి కార్యకర్త పోస్టులకు దరఖాస్తు చేయగోరు -అభ్యర్థులు 7వ తరగతి ఖచ్చితంగా ఉత్తీర్ణులై యుండవలయును. 7వ తరగతి ఉత్తీర్ణులైన అభ్యర్థులు అందుబాటులో లేనట్లయితే, తదుపరి దిగువ తరగతులలో అత్యధిక అర్హత కలిగిన అభ్యర్ధిని పరిగణనలోకి తీసుకొనబడుతుంది.

e) ఎస్.సి./ఎస్.టి. హాబిటేషన్ల కొరకు కేటాయించిన అంగన్వాడి కేంద్రముల (మెయిన్/మినీ) యందు కేవలం యస్.సి./ఎస్.టి. అభ్యర్థులు మాత్రమే ఎంపిక చేయబడుదురు

f) నోటిపై చేయబడిన యస్.సి./ఎస్.టి. అంగన్వాడి కేంద్రములకు యస్.సి./ఎస్.టి. అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకొనవలయును. మరియు నోటిపై చేయబడిన యస్.సి./ఎస్.టి. అంగన్వాడి కేంద్రముల పోస్టులకు సంబంధించి 21 సం. లు దాటిన అభ్యర్ధులు అందుబాటులో లేనప్పుడు, 18 సం. వయస్సున్న అభ్యర్థుల దరఖాస్తులు పరిగణలోనికి తీసుకొనబడును (18 to 35 years of age.)

॥I) దిగువ తెలుపబడిన పారామీటర్లు మరియు మార్కుల ప్రకారము అంగన్వాడి కార్యకర్త, సహాయకురాలు, మరియు మినీ అంగన్వాడి కార్యకర్త పోస్టులకు అభ్యర్థులను జిల్లా ఎంపిక కమిటీ వారిచే ఎంపిక చేయుట జరుగును.

దరఖాస్తు ఫారం యందు ఖచ్చితముగా నమోదు చేసి వాటికి సంబందించిన దృవీకరణపత్రముల 
కావున అభ్యర్థులు పై తెలుపబడిన 1 నుండి 5 పారామీటర్లకు సంబందించిన పూర్తి సమాచారమును నకలులు మరియు పై తెలుపబడిన అన్ని అర్హతలు తదితరములకు సంబందించిన దృవీకరణపత్రముల నకలులు ఎదేనా గజిటెడ్ అధికారి వారిచే అటెస్టేషన్ గావింపబడిన నకలులు దరఖాస్తునకు ఖచ్చితంగా జతపరుచవలయును. అట్లు జతపరచని ఎడల వాటికి సంబందించిన సమాచారమును పరిగణలోనికి తీసుకొనబడదు.

IV) తెలుపబడిన ఖాళీల భర్తీ యందు ప్రభుత్వ నిబందనల ప్రకారము ఐ.సి.డి.యస్. ప్రాజెక్టు ఒక యూనిట్ గా పరిగణిస్తూ రూల్ అఫ్ రిజర్వేషన్ అమలు చేయబడుతుంది. జతపరచబడిన జాబితాల యందు పోస్టునకు ఎదురుగా కేటాయించబడిన కేటగిరికి చెందిన అభ్యర్థులు మాత్రమే సదరు పోస్టునకు అర్హులు, మరియు సదరు కేటగిరినకు సంబందించి నిర్దేశిత అధికారి వారిచే జారీ చేయబడిన, నిబందనల ప్రకారం వ్యాలిడిటి కలిగిన దృవీకరణపత్రముల నకలులు దరఖాస్తునకు ఖచ్చితంగా జతపరుచవలయును (యస్.సి./ఎస్.టి./బి.సి./EWS/Minor Locomotor Disability/ Disabled కేటగిరినకు చెందిన వారు మాత్రమే). అట్లు జతపరచని ఎడల వాటికి సంబందించిన సమాచారమును పరిగణలోనికి తీసుకొనబడదు మరియు అట్టి దరఖాస్తులు invalid గా పరిగణించబడును (ఓ.సి. కేటగిరి క్రింద కేటాయించబడిన పోస్టులకు పై అర్హతలు కలిగియున్న ఎవ్వరైననూ దరఖాస్తు చేసుకొనవచ్చును).

V) అభ్యర్థుల ఎంపికలో అంగన్వాడి కేంద్రము ఉన్న గ్రామమును స్థానికతకు ప్రాతిపదికగా తీసుకొనుట జరుగును. మునిసిపాలిటీలలో వార్డును స్థానికతకు ప్రాతిపదికగా తీసుకొనుట జరుగును. కావున 
అభ్యర్థులు వారి స్థానికతకు సంబంధించి పూర్తి సమాచారమును దరఖాస్తు ఫారం యందు నిర్దేశిత coloumn లో పొందుపరిచి వాటి దృవీకరణ పత్రములు అనగా ఆధార్ కార్డు/రేషన్ కార్డ్/వోటర్ కార్డ్/మీ సేవ ద్వారా జారీ చేయబడిన దృవీకరణ పత్రములను విధిగా దరఖాస్తునకు జతపరుచవలయును. అట్లు జతపరచని ఎడల వారి దరఖాస్తు పరిగణలోనికి తీసుకొనబడదు.

VI) ప్రభుత్వము వారి మెమో సంఖ్య WDC01/1481061/2020/Prog.ll/A1, తేది: 25.08.2021 ప్రకారం మినీ అంగన్వాడీ వర్కర్ల ఎంపికలో వికలాంగులకు రిజర్వేషన్ నియమం పిల్లల భద్రత దృష్ట్యా పూర్తిగా మినహాయించబడుటయినది. అంగన్వాడీ కార్యకర్తలు మరియు సహాయకురాలులకు సంబంధించి, 6 (అంధత్వం మరియు తక్కువ దృష్టి), 31 (చెవిటివారు మరియు వినికిడి లోపం) మరియు 86 (ఆటిజం, మేధోపరమైన వైకల్యం, నిర్దిష్ట అభ్యాస వైకల్యం, మానసిక వైకల్యం, బహుళ వైకల్యాలు) వ రోస్టర్ పాయింట్ రిజర్వేషన్కు మినహాయింపు ఉంది. పిల్లల భద్రత మరియు శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని, మైనర్ లోకోమోటర్ వైకల్యం ఉన్న వ్యక్తులు మాత్రమే పిల్లల సంరక్షణ మరియు గృహ సందర్శనల సామర్థ్యానికి ఆటంకం కలిగించని 4 వైకల్యం రోస్టర్ పాయింట్లకు వ్యతిరేకంగా పరిగణించబడతారు. మైనర్ లోకోమోటర్ వైకల్యం ఉన్న అటువంటి అర్హత గల వ్యక్తి లేకుంటే, 6, 31 మరియు 86 వద్ద ఉన్న రోస్టర్ పాయింట్లను వైకల్యం ఉన్న వ్యక్తులతో కాకుండా ఇతరులతో నింపబడుదురు. 56 వద్ద ఉన్న రోస్టర్ పాయింట్ మాత్రమే తదుపరి రిక్రూట్మెంట్ నోటిఫికేషను ఫార్వార్డ్ చేయబడవచ్చు మరియు రెండవ నోటిఫికేషన్లో కూడా మైనర్ లోకోమోటర్ వైకల్యం ఉన్న అర్హత గల అభ్యర్థి లేకుంటే, రోస్టర్ పాయింట్ 56 కూడా వికలాంగులు కాకుండా ఇతరులతో నింపవచ్చు. కావున తదనుగుణంగా ఈ ప్రకటన యందు రోస్టర్ పాయింట్లు కేటాయించడం జరిగినది.

g) ప్రకటింపబడిన పోస్టులలో గౌరవ న్యాయస్థానముల యందు కేసులు పెండింగులో ఉన్న వాటి భర్తనకు సంబందించి, ఆయా కేసులకు సంబందించి వెలువడు తదుపరి ఉత్తర్వులు మేరకు వారి నియామకము రద్దు పరచుట కాని, కొనసాగింపు కాని జరుగును.

h) అంగన్వాడీ కార్యకర్త, అంగన్వాడీ హెల్పర్లు గౌరవ కార్యకర్తలు కావున ఈ నియామకము. పూర్తిగా తాత్కాలికము మరియు పోస్టులకు నియామకమగు అభ్యర్థులకు ప్రభుత్వ నిబందనల ప్రకారము గౌరవ వేతనము మాత్రమే చెల్లించబడును.

దరఖాస్తు చేయగోరు అభ్యర్థులు తమ పూర్తి బయోడాటాతో పై తెలుపబడిన విధముగా వారి అర్హతలకు సంబందించిన అన్ని దృవీకరణ పత్రములను ఏదేనా గజిటెడ్ అధికారి వారితో అటేస్టేషన్ చేయించి, వాటిని సంబందిత శిశు అభివృద్ధి పథక అధికారి వారి కార్యాలయము (ఐ.సి.డి.యస్. ప్రాజెక్ట్ కార్యాలయము) యందు సమర్పించి తగు రశీదు పొందవలయును.

దరఖాస్తు చేసుకొనుటకు ఆఖరు తేది: 06/02/2023. ఇంటర్వ్యూ నిర్వహణ తేది: 11/02/2023 ఉదయం 11.00 గం.లకు 

ఇంటర్వ్యూ నిర్వహణ ప్రదేశము: సంబంధిత రెవెన్యూ డివిజనల్ అధికారి వారి ఈ ప్రకటనను ఎటువంటి కారణములు లేకనే రద్దు పరచుటకుగాని మరియు వాయిదా వేయుటకుగాని లేక మార్పులు చేర్పులు చేయుటకుగాను జిల్లా కలెక్టర్ & అధ్యక్షులు, జిల్లా మహిళా & శిశు సంక్షేమ & సాధికారితో అధికారి వారి కార్యాలయము, కడప వారికి సర్వ హక్కులు కలవు.

ఈ నోటిఫికేషన్ మరియు దరఖాస్తు ఫారం ను https://kadapa.ap.gov.in/ వెబ్సైటు నుండి డౌన్లోడ్ చేసుకొనగలరు.


వివిధ రకాల కేంద్రా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్ లు కావలసినవారు క్రింది వాట్స్అప్ గ్రూప్లో చేరండి:


Job Notifications Telegram Group:

Important Job Notifications:



Indian Army : ఇండియన్ ఆర్మీలో ఎన్‌సీసీ స్పెషల్ ఎంట్రీ స్కీమ్ కోర్సులో ప్రవేశాలు

Posted in:

Related Posts

0 comments:

Post a Comment

Latest Job Notifications

Subscribe My Whatsapp & Telegram Groups More

Sponsered Links

Sponsered Links

Job Related Material

More

Bank Jobs

More
Top