TSSPDCL Latest Updates:తెలంగాణలో ఉద్యోగాల జాతర కొనసాగుతోంది. గతేడాది డిసెంబర్ లో భారీగా నోటిఫికేషన్లు వచ్చేశాయి. ఇందులోని పలు ఉద్యోగాలను పబ్లిక్ సర్వీస్ కమిషన్ భర్తీ చేయనుండగా...
మరిన్నింటిని ఆయా శాఖలు భర్తీ చేస్తున్నాయి. ఇందులో భాగంగా తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (TSSPDCL) ఇప్పటికే పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు కూడా జారీ చేసింది. పరీక్షలను కూడా నిర్వహించిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా మరో కీలక అప్డేట్ ఇచ్చింది టీఎస్ఎస్పీడీసీఎల్. ఖాళీగా ఉన్న మరో 1601 ఉద్యోగాలను భర్తీ చేసేందుకు సిద్ధమైంది. ఇందులో భాగంగా ఓ ప్రకటన జారీ చేసింది.తాజా ప్రకటనలో భాగంగా మొత్తం 1601 ఉద్యోగాలు ఉండగా ఇందులో... 1,553 జూనియర్ లైన్‌మెన్ (జేఎల్‌ఎం), 48 అసిస్టెంట్ ఇంజనీర్ ఎలక్ట్రికల్) పోస్టులను భర్తీ చేయనున్నారు. దరఖాస్తుల ప్రారంభం, ఖాళీల వివరాలను ఫిబ్రవరి 15వ తేదీన పూర్తిస్థాయి నోటిఫికేషన్ లో వెల్లడించనున్నట్లు TSSPDCL ప్రకటించింది. ఈ మేరకు శుక్రవారం ఓ ప్రకటన ఇచ్చింది. https://tssouthernpower.cgg.gov.in వెబ్ సైట్ సందర్శించి వివరాలు తెలుసుకోవచ్చు
వివిధ రకాల కేంద్రా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్ లు కావలసినవారు క్రింది వాట్స్అప్ గ్రూప్లో చేరండి:
Job Notifications Telegram Group:
0 comments:
Post a Comment