హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (హెపీసీఎల్) ముంబయి రిఫైనరీలో.. 60 అసిస్టెంట్ ప్రాసెస్ టెక్నీషియన్, అసిస్టెంట్ బాయిలర్ టెక్నీషియన్, అసిస్టెంట్ ఫైర్ అండ్ సేఫ్టీ ఆపరేటర్ తదితర పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది.
విద్యార్హత: ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు పోస్టును బట్టి 12వ తరగతి, ఐటీఐ, బీఎస్సీ, డిప్లొమా లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. బాయిలర్ అటెండెంట్ కాంపిటెన్సీ సర్టిఫికెట్, బేసిక్ ఫైర్ ఫైటింగ్ కోర్సు సర్టిఫికేట్‌తోపాటు హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ కూడా ఉండాలి.
అభ్యర్థుల వయస్సు: అభ్యర్ధుల వయసు 18 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి.
దరఖాస్తు చేసే విధానం: అర్హతలున్నవారు ఆన్‌లైన్ విధానంలో
ముఖ్యమైన తేదీలు: ఫిబ్రవరి 25, 2023వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు సమయంలో జనరల్/ఎక్స్ సర్వీస్‌మెన్/ఓబీసీ/ఈడబ్ల్యూఎస్ అభ్యర్ధులు రూ.590లు అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూబీడీ అభ్యర్ధులు ఫీజు చెల్లించనవసరం లేదు.
ఎంపిక విధానం: కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, జనరల్ ఆప్టిట్యూడ్ టెస్ట్, స్కిల్ టెస్ట్, వైద్య పరీక్షలు, ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా ఎంపిక చేస్తారు. ఎంపికైన వారికి నోటిఫికేషన్‌లో సూచించిన విధంగా జీతభత్యాలు చెల్లిస్తారు. ఇతర సమాచారం అధికారిక నోటిఫికేషన్‌లో చెక్ చేసుకోవచ్చు.
ఖాళీల వివరాలు..
అసిస్టెంట్ ప్రాసెస్ టెక్నీషియన్ పోస్టులు: 30
అసిస్టెంట్ బాయిలర్ టెక్నీషియన్ పోస్టులు: 7
అసిస్టెంట్ ఫైర్ అండ్ సేఫ్టీ ఆపరేటర్ పోస్టులు: 18
అసిస్టెంట్ మెయింటెనెన్స్ టెక్నీషియన్ (ఎలక్ట్రికల్) పోస్టులు: 5
Complete Notification: Click Here
వివిధ రకాల కేంద్రా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్ లు కావలసినవారు క్రింది వాట్స్అప్ గ్రూప్లో చేరండి:
Job Notifications Telegram Group:
0 comments:
Post a Comment