ప్రభుత్వ రంగంతో పాటు ప్రైవేటు రంగంలోనూ ఈ రోజుల్లో జోరుగా ఉద్యోగావకాశాలు లభిస్తున్నాయి. విద్యావేత్తలు, రాజకీయ నాయకులు, స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో జాబ్ మేళాలను (Job Mela) భారీగా నిర్వహిస్తున్నారు. దీంతో నిరుద్యోగ యువకులకు వేలాదిగా ఉద్యోగావకాశాలు లభిస్తున్నాయి. తాజాగా కోదాడలో భారీ జాబ్ మేళాను (Job Mela) ప్రకటించారు. టీఆర్ఎస్ నేత, కోదాడ నియోజకవర్గ మాజీ ఇన్ ఛార్జి శశిధర్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ జాబ్ మేళాను నిర్వహించనున్నారు. ఈ నెల 25న ఈ జాబ్ మేళా జరగనుంది. ఈ జాబ్ మేళా ద్వారా మొత్తం 72 కంపెనీల్లో 9 వేలకు పైగా ఉద్యోగావకాశాలను కల్పించనున్నారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ముందుగా రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది.
ఏఏ విభాగాల్లో అంటే:ఈ జాబ్ మేళా ద్వారా ఐటీ, మెడికల్, మార్కెంటింగ్, మేనేజ్మెంట్, హోటల్స్, ఇండస్ట్రీలు, బీపీఓ, డేటా ఎంట్రీ, నర్సింగ్, ఫార్మా రంగాల్లో ఉద్యోగావకాశాలను కల్పించనున్నారు.
విద్యార్హతలు:
7, 10, ఇంటర్, గ్రాడ్యుయేట్, ఐటీఐ, డిప్లొమా, బీఫార్మసీ, ఎంఫార్మసీ, హోటల్ మేనేజ్మెంట్, బీఏ, బీఎస్సీ, బీకాం, బీటెక్, ఎంటెక్, ఎంబీఏ, ఎంసీఏ, ఎంసీఎస్ తదితర విద్యార్హతలు కలిగిన వారు అప్లై చేసుకోవచ్చు. మూగ, చెవిటి, దివ్యాంగులు కూడా అప్లై చేసుకోవచ్చు.వేతనం: ఎంపికైన వారికి నెలకు రూ.15 వేల నుంచి రూ.లక్ష వరకు వేతనం ఉంటుంది.
ఇంటర్వ్యూ నిర్వహించే వేధిక: పెరిక భవన్, కోదాడ.
తేదీ: ఫిబ్రవరి 25, ఉదయం 10 గంటలకు
హెల్ప్ లైన్ నంబర్లు: 9346848034, 9010140584
రిజిస్ట్రేషన్-LINK: Click Here
వివిధ రకాల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్ లు కావలసినవారు క్రింది వాట్స్అప్ గ్రూప్ లో చేరండి:
Job Notifications Telegram Group:
Subscribe My Whatsapp & Telegram Groups
0 comments:
Post a Comment