సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్‌లో హెడ్‌కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి నిర్వహించనున్న పరీక్ష హాల్‌టికెట్లను ఫిబ్రవరి 20న అధికారులు విడుదల చేశారు. వాస్తవానికి ఫిబ్రవరి 15న విడుదల కావాల్సిన అడ్మిట్ కార్డులు సాంకేతిక కారణాల వల్ల 5 రోజులు ఆలస్యంగా అందుబాటులోకి వచ్చాయి. అధికారిక వెబ్‌సైట్‌లో అడ్మిట్ కార్డులను అందుబాటులో ఉంచారు. రాతపరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు యూజర్ ఐడీ, పాస్‌వర్డ్ వివరాలు నమోదుచేసి అడ్మిట్‌కార్డులు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అలాగే అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్ (ASI - స్టెనోగ్రాఫర్) పోస్టుల రాతపరీక్షకు సంబంధించిన హాల్‌టికెట్లను ఫిబ్రవరి 22 నుంచి అందుబాటులో ఉంచనున్నట్లు అధికారులు ప్రకటించారు.ప్రకటించిన షెడ్యూలు ప్రకారం ఫిబ్రవరి 22 నుంచి 28 వరకు సీఆర్‌పీఎఫ్ హెడ్ కానిస్టేబుల్ పరీక్ష నిర్వహించనున్నారు. రాతపరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు తర్వాతి దశలో స్కిల్ టెస్ట్, ఫిజికల్ ఈవెంట్లు, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ పరీక్షలు నిర్వహిస్తారు.
కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వశాఖ పరిధిలోని సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. దీనిద్వారా మొత్తం 1458 పోలీసు ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. వీటిలో 143 అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్ (ASI - స్టెనోగ్రాఫర్) పోస్టులు, 1315 హెడ్ కానిస్టేబుల్(మినిస్టీరియల్) పోస్టులు ఉన్నాయి. అభ్యర్థుల నుంచి జనవరి 4 నుంచి 25 వరకు దరఖాస్తులు స్వీకరించారు. ఎంపికైన అభ్యర్థులు దేశవ్యాప్తంగా ఎక్కడైనా విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది. ఏఎస్‌ఐ పోస్టులకు రూ.29,200 - రూ.92,300; హెడ్ కానిస్టేబుల్ పోస్టులకు రూ.25,500-రూ.81,100 జీతంగా ఇస్తారు.
అడ్మిట్‌కార్డులు ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి...
స్టెప్-1: సీఆర్‌పీఎఫ్ హెడ్‌కానిస్టేబుల్ అడ్మిట్ కార్డుల కోసం అభ్యర్థులు మొదట అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి- https://crpf.gov.in
స్టెప్-2: అక్కడ హోంపేజీలో కనిపించే "Recruitment" ట్యాబ్ మీద క్లిక్ చేయాలి.
స్టెప్-3: అక్కడ"ASI/Head Constable Admit Card" లింక్ మీద క్లిక్ చేయాలి.
స్టెప్-4: క్లిక్ చేయగానే వచ్చే లాగిన్ పేజీలో అభ్యర్థులు తమ యూజర్ ఐడీ, పాస్‌వర్డ్ వివరాలు నమోదుచేయాలి.
స్టెప్-5: "Submit" బటన్ మీద క్లిక్ చేయలి.
స్టెప్-6: అభ్యర్థికి సంబంధించిన 'CRPF admit card' స్క్రీన్ మీద కనిపిస్తుంది.
స్టెప్-7: హాల్‌టికెట్ డౌన్‌లోడ్ చేసుకొని, ప్రింట్ తీసుకోవాలి.
0 comments:
Post a Comment