IPPB Recruitment 2023 : ఇండియా పోస్ట్
పేమెంట్స్ బ్యాంక్ (IPPB) జాబ్ నోటిఫికేషన్ (Job Notification) విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ విభాగంలో 41 జూనియర్ అసోసియేట్, అసిస్టెంట్ మేనేజర్, మేనేజర్, సీనియర్ మేనేజర్, చీఫ్ మేనేజర్ పోస్టుల్ని భర్తీ చేయనుంది. ఈ పోస్టులకు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. ఫిబ్రవరి 28 దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేది. ఆసక్తి గల అభ్యర్థులు ఆఫ్లైన్ పద్ధతిలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. వివరాల్లోకెళ్తే..
మొత్తం ఖాళీలు: 41
జూనియర్ అసోసియేట్ (IT)- 15
అసిస్టెంట్ మేనేజర్ (IT)- 10
మేనేజర్ (IT)- 9
సీనియర్ మేనేజర్ (IT)- 5
చీఫ్ మేనేజర్ (IT)- 2
ముఖ్య సమాచారం:
విద్యార్హతలు: ఏదైనా బ్యాచిలర్స్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. బ్యాచిలర్ ఆఫ్ సైన్స్, బ్యాచిలర్ ఆఫ్ ఇంజనీరింగ్, బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీ, ఎంఎస్సీ ఇన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎంఎస్సీ ఇన్ కంప్యూటర్ సైన్స్, బీసీఏ, ఎంసీఏ లాంటి కోర్సులు చదివిన వారికి ప్రాధాన్యం ఉంటుంది.
అనుభవం: మొబైల్ బ్యాంకింగ్, ఇంటర్నెట్ బ్యాంకింగ్, ఏఎంఎల్, రిస్క్, అప్లికేషన్ సపోర్ట్ ఫర్ సీబీఎస్, సీఐఎస్, టెస్టింగ్ అండ్ రిలీజ్ లాంటి విభాగాల్లో కనీసం 3 నుంచి 5 ఏళ్ల అనుభవం ఉండాలి
వయస్సు: 55 ఏళ్ల లోపు ఉండాలి.
ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. పరిస్థితులను బట్టి గ్రూప్ డిస్కషన్ లేదా ఆన్లైన్ టెస్ట్ కూడా నిర్వహించవచ్చు.
దరఖాస్తుకు చివరి తేదీ: ఫిబ్రవరి 28, 2023
• పూర్తి వివరాలకు వెబ్సైట్:
వివిధ రకాల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్ లు కావలసినవారు క్రింది వాట్స్అప్ గ్రూప్ లో చేరండి:
Job Notifications Telegram Group:
Subscribe My Whatsapp & Telegram Groups
0 comments:
Post a Comment