బ్రాడ్ కాస్ట్ ఇంజనీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ (BECIL) నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. పలు ఉద్యోగాలను (Jobs) భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు సంస్థ తాజాగా నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 159 ఖాళీలను భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు. టెక్నీషియన్, ఇతర విభాగాల్లో ఈ ఖాళీలు ఉన్నాయి. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ becil.com తమ దరఖాస్తులను సమర్పించాల్సి ఉంటుంది. ఈ ఉద్యోగాలకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభం కాగా.. దరఖాస్తు చేసుకోవడానికి మార్చి 7ను ఆఖరి తేదీగా నిర్ణయించారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆ తేదీలోగా తమ దరఖాస్తులను సమర్పించాల్సి ఉంటుంది.
విభాగాల వారీగా ఖాళీల వివరాలు:
- మెడికల్ ఆఫీసర్ ఆయుష్: 3 పోస్టులు
- ఫార్మసిస్ట్ 9
- జూనియర్ ఫిజియోథెరపిస్ట్ 4
- టెక్నీషియన్ 1
- మెడికల్ రికార్డ్ టెక్నీషియన్ 8
- డెంటల్ టెక్నీషియన్ 3
- టెక్నీషియన్ (OT) 20
- టెక్నీషియన్ (రేడియాలజీ): 6
- టెక్నీషియన్ (రేడియోథెరపీ): 2
- టెక్నీషియన్ (లేబరేటరీ): 30
- టెక్నీషియన్ (డయాలసిస్): 4
- టెక్నీషియన్ (న్యూక్లీయర్ మెడిసిన్): 2
- స్టెనోగ్రాఫర్: 4
- జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్: 4
- జూనియర్ వార్డెన్: 2
- జూనియర్ ఇంజనీర్: 5
విద్యార్హతలు: వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలను నిర్ణయించారు. అభ్యర్థులు ఆ వివరాలను నోటిఫికేషన్లో చూడొచ్చు.ఎలా అప్లై చేయాలంటే??
Step 1: అభ్యర్థులు మొదటగా అధికారిక వెబ్ సైట్ http://www.becil.com/ ను ఓపెన్ చేయాలి.
Step 2: అనంతరం Careers విభాగంపై క్లిక్ చేయాలి.
Step 3: రిజిస్ట్రేషన్ ఫామ్ పై క్లిక్ చేయాలి.
Step 4: అనంతరం వివారలను నమోదు చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అనంతరం అప్లికేషన్ ఫామ్ నింపాలి.
Step 5: తర్వాత మీ అప్లికేషన్ ఫామ్ ను ప్రింట్ తీసుకుని భద్రపరుచుకోవాలి.
వివిధ రకాల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్ లు కావలసినవారు క్రింది వాట్స్అప్ గ్రూప్ లో చేరండి:
Job Notifications Telegram Group:
0 comments:
Post a Comment