కేంద్ర సాయుధ బలగాలైన సీఏపీఎఫ్, ఎస్ఎస్ఎఫ్, అస్సాం రైఫిల్స్‌లో 46,535 కానిస్టేబుల్(జీడీ)/ రైఫిల్‌మ్యాన్(జీడీ) ఉద్యోగాల భర్తీకి సంబంధించి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ గతేడాది నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఎస్‌ఎస్‌సీ జనవరిలో ఆన్‌లైన్ కంప్యూటర్ ఆధారిత పరీక్షను నిర్వహించింది. ఈ పరీక్ష సమాధానాల ప్రాథమిక కీని ఫిబ్రవరి 18న స్టాఫ్ సెలక్షన్ విడుదల చేసింది. ఈ మేరకు అధికారి ప్రకటనను విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో ఆన్సర్ కీని అందుబాటులో ఉంచింది. పరీక్ష రాసిన అభ్యర్థులు వెబ్‌సైట్‌లో తమ రిజిస్ట్రేషన్ నంబర్, పాస్‌వర్డ్ వివరాలు నమోదుచేసి ఆన్సర్ కీతో పాటు అభ్యర్థుల రెస్పాన్స్ షీట్లను కూడా డౌన్‌లోడ్ చేసుకోవచ్చుఆన్సర్ కీపై అభ్యంతరాలకు అవకాశం..
ప్రాథమిక కీపై అభ్యంతరాలు తెలిపేందుకు అవకాశం కల్పించారు. అభ్యంతరాల స్వీకరణ ఫిబ్రవరి 18న సాయంత్రం 5 గంటలకు ప్రారంభమైంది. కాగా ఫిబ్రవరి 25న సాయంత్రం 5 గంటల వరకు అభ్యంతరాలు తెలియజేయవచ్చు. అభ్యర్థులు అభ్యంతరాలు తెలిపే ఒక్కోప్రశ్నకు రూ.100 చొప్పున ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. త్వరలో తుది కీతో పాటు ఫలితాలు వెలువడనున్నాయి. అనంతరం ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, వైద్య పరీక్షలు, ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.
వివిధ రకాల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్ లు కావలసినవారు క్రింది వాట్స్అప్ గ్రూప్ లో చేరండి:
Job Notifications Telegram Group:
Subscribe My Whatsapp & Telegram Groups
0 comments:
Post a Comment