Central Jobs 2023: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. 500 ఉద్యోగాలకు నోటిఫికేషన్.. ఇలా అప్లై చేయండి

ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (IOCL) నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. భారీగా ఉద్యోగాలను (IOCL Jobs) భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది.మొత్తం 513 ఖాళీలకు భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్లో (IOCL Notification) పేర్కొన్నారు. జూనియర్‌ ఇంజనీర్‌ విభాగంలో ఈ పోస్టులను భర్తీ చేస్తున్నారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్లైన్ లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ మార్చి 1న ప్రారంభించనున్నారు. దరఖాస్తు చేసుకోవడానికి మార్చి 20ని ఆఖరి తేదీగా నిర్ణయించారు

మొత్తం ఖాళీలు:513

విద్యార్హతల వివరాలు: ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు కెమికల్‌/మెకానికల్‌/ఎలక్ట్రికల్‌/ఫిజిక్స్‌/ఇండస్ట్రియల్‌ కెమిస్ట్రీ/మ్యాథమెటిక్స్‌/ రిఫైనరీ అండ్‌ పెట్రోకెమికల్‌ ఇంజనీరింగ్‌, ఎమ్మెస్సీ, సంబంధిత స్పెషలైజేషన్‌లో డిప్లొమా లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. సంబంధిత పనిలో అనుభవం కలిగి ఉండాలి. 

దరఖాస్తుదారుల వయసు: 18 నుంచి 26 ఏళ్ల మధ్య ఉండాలని నోటిఫికేషన్లో స్పష్టం చేశారు. రిజర్వేషన్‌ వర్గాలకు వయోపరిమితి విషయంలో సడలింపు ఉంటుందని పేర్కొన్నారు. 

ఎలా అప్లై చేయాలంటే?

- అభ్యర్థులు మొదటగా అధికారిక వెబ్ సైట్ https://www.iocl.com/ ను ఓపెన్ చేయాలి. 

- హోం పేజీలో కనిపించే కెరీర్స్ ఆప్షన్ పై క్లిక్ చేయాలి. 

- Click here for Latest Job Opening అనే ఆప్షన్ పై క్లిక్ చేయాలి. 

- నోటిఫికేషన్ దగ్గర అప్లై ఆప్షన్ పై క్లిక్ చేయాలి. 

- మీ వివరాలను నమోదు చేసి దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేయాలి.


వివిధ రకాల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్ లు కావలసినవారు క్రింది వాట్స్అప్ గ్రూప్ లో చేరండి:


Job Notifications Telegram Group:

Posted in:

Related Posts

0 comments:

Post a Comment

Latest Job Notifications

Subscribe My Whatsapp & Telegram Groups More

Sponsered Links

Sponsered Links

Job Related Material

More

Bank Jobs

More
Top