2023-24 సం॥ నేషనల్ యూత్ వాలంటీర్లు ఎంపిక కొరకు దరఖాస్తులకై ఆహ్వానం.

భారత ప్రభుత్వం, కేంద్ర యువజన వ్యవహారాలు మరియు క్రీడా మంత్రిత్వశాఖ, నెహ్రుయువకేంద్ర, విజయవాడ వారి ద్వారా ఎన్టీఆర్ మరియు కృష్ణాజిల్లాలో 16 బ్లాక్ లో అనగా అవనిగడ్డ, మొవ్వు, మచిలీపట్నం, గుడివాడ, బంటుమిల్లి, పామర్రు, కంకిపాడు, ఉయ్యూరు, విజయవాడ, మైలవరం, జగ్గయ్యపేట, గన్నవరం, విస్సన్నపట, తిరువూరు, నందిగామ మరియు కంచికచర్ల బ్లాకులలో యువజన మరియు గ్రామీణాభివృద్ధి కార్యక్రమాలయందు సేవాభావంతో పనిచేయుటకు ఆసక్తి గల యువతీ యువకులు జాతీయ యువ స్వచ్చంద సేవా కార్యకర్తలుగా పనిచేయుటకు దరఖాస్తులను ఆహ్వానించడమైనది. 

మొత్తం ఖాళీలు:16

వయసు:

1వ తేదీ, ఏప్రిల్, 2023 తేదీ నాటికి 18 నుండి 29 సంవత్సరములలోపు వయసు కలిగి ఉండాలి

విద్యార్హతలు:

కనీసం పదవ తరగతి విద్యార్హత కలిగిన వారు అర్హులు. వాలంటీర్లుగా స్వచ్చంద సేవచేసే స్వభావం కలిగి వుండవలెను. 

నియామకము:

రెండు సంవత్సరాల కాలమునకు గాను అనగా ది. 31-03-2025 వరకు ఈ నియామకం వుండును. ముఖ్యంగా యువజన సంఘాలు, మహిళామండళ్ళ స్థాపన, క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలు, యువజన చైతన్య సదస్సులు, విద్య, వైద్యం, వైద్యం, పారిశుద్ధ్యం, సామాజిక చైతన్య అంశాలు చేపట్టవలసి వుంటుంది. కంప్యూటర్ అప్లికేషన్స్, ఆండ్రాయిడ్ మొబైల్ అప్లికేషన్స్, ఈ బ్యాంకింగ్, డిజి ధన్ వంటి అప్లికేషన్స్ పై అవగాహన మరియు ఇతర సాంకేతిక ఉన్నత విద్యార్హత, అభ్యర్థులకు, మహిళా అభ్యర్థులకు, నెహ్రూ యువకేంద్ర అనుబంధ సంఘాల సభ్యులకు ప్రాధాన్యత ఇవ్వబడును. 

జీతం

ఎంపికైన అభ్యర్థులకు నెలకు 5,000/- రూపాయలు చెల్లించబడుతుంది. ప్రస్తుతం చదువుతున్నవారు, ఉద్యోగం చేస్తున్నవారు దరఖాస్తు చేయుటకు అనర్హులు. అభ్యర్థులు తప్పనిసరిగా కృష్ణా మరియు ఎన్టీఆర్ జిల్లా వాసులై యుండవలెను. 

దరఖాస్తు చేసే విధానం:

అభ్యర్థులు ఆన్లైన్ పద్ధతిన www.nyks.nic.in వెబ్సైట్ ద్వారా గాని వ్యక్తిగతంగా గాని దరఖాస్తు చేయవలసి ఉంటుంది. 

ముఖ్యమైన తేదీలు:

దరఖాస్తు చేయుటకు చివరి తేదీ 09 మార్చి 2023, దరఖాస్తుల స్వీకరణ మరియు అభ్యర్థుల ఎంపిక నెహ్రూ యువకేంద్ర సంఘటన్ ముఖ్యకార్యాలయ నియమావళికి లోబడి నిర్వహించడం జరుగుతుంది. 

వాలంటీర్లు ఎంపిక విధానం:

NYKS వాలంటిర్ ఎంపిక ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక జరుగుతుంది. ఇంటర్వ్యూకి వచ్చేటప్పుడు దరఖాస్తు సమయంలో నింపిన దరఖాస్తు ఫారంతో పాటు అసలు అన్ని సంబంధిత పత్రాలతో పాటు ఫోటోకాపీ మరియు రెండు ఇటీవలి పాస్పోర్ట్ సైజు ఛాయాచిత్రాలను తీసుకురావాలి. ఎంపిక కోసం ఇంటర్వ్యూకు సంబంధించిన సమాచారం ఇమెయిల్ మరియు SMS/ వాట్సాప్ సందేశం ద్వారా తెలియజేయబడుతుంది. ఇది కేవలం స్వచ్ఛంద సేవ మాత్రమే ఉద్యోగం కాదు. పూర్తి వివరాలకు జిల్లా యువజన అధికారి, నెహ్రూ యువ కేంద్ర కార్యాలయము, ఫ్లాట్ నెంబర్ 24, లక్ష్మీపతినగర్ కాలనీ, ఆటోనగర్ గేట్ ఎదురుగా, పటమట, విజయవాడ వారిని గాని లేదా dyc.vijayawa da@gmail.com అనే e-mail ద్వారా కాని, 0866-2555828, 99663 57021, 9490908517 ఫోన్ నెంబర్లను గాని సంప్రదించవచ్చును.
Posted in:

Related Posts

0 comments:

Post a Comment

Latest Job Notifications

Subscribe My Whatsapp & Telegram Groups More

Sponsered Links

Sponsered Links

Job Related Material

More

Bank Jobs

More
Top