25, 26 తేదీల్లో పాలిటెక్నిక్ జాబ్‌మేళా
పాలిటెక్నిక్ విద్యార్థుల కోసం జాబ్‌మేళా నిర్వహిస్తున్నామని సాంకేతిక విద్య కమిషనరు సిహెచ్ నాగరాణి తెలిపారు.ఈ నెల 25, 26 తేదీల్లో విజయవాడలోని ఐలాపురం కన్వెన్షన్ సెంటర్‌లో జాబ్‌మేళా నిర్వహించనున్నట్లు గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఇసిఇ, ఇఇఇ, ఇన్‌స్ట్రుమెంటేషన్ బ్రాంచ్‌లలో 2022లో ఉత్తీర్ణులైన విద్యార్థులు అర్హులని తెలిపారు. నేరుగా వాక్‌ఇన్ ఇంటర్వ్యూలకు హాజరు కావచ్చన్నారు. రైలు రవాణా సేవలను అందించే మేధాసర్వోడ్రైవ్స్‌లో రూ.3 లక్షల ప్యాకేజీతో వంద మంది ఇంజినీరింగ్ ట్రైనీలను తీసుకోనున్నారని వివరించారు. ఆసక్తిగల అభ్యర్థులు మరిన్ని వివరాల కోసం 9346207421, 6309953362 నెంబర్లను సంప్రదించవచ్చని పేర్కొన్నారు.
0 comments:
Post a Comment