తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి 20225 టీఎస్పీఎస్సీతో సహా విశాఖల రిక్రూట్మెంట్ బోర్డులు ఉద్యోగ ప్రకటనలు జారీచేశాయి. రాష్ట్ర ప్రభుత్వం 80 వేల ఉద్యోగాల భర్తీకి ప్రకటన చేసిన విషయం తెలిసిందే. గతేడాది తెలంగాణ రాష్ట్రంలో 30 ప్రకటనలు వెలువడగా... 38,637 ఉద్యోగాలు భర్తీకానున్నాయి. ఈ ఏడాదిలో నియామకాలకు సంబంధించి రాతపరీక్షలు జరుగనున్నాయి. ప్రభుత్వం ఇప్పటివరకు 21,637 ఉద్యోగాల భర్తీ బాధ్యతను టీఎస్పీఎస్సీకి అప్పగించింది. గ్రూప్-1 పరీక్షకు సంబంధించి ఇప్పటికే ప్రిలిమినరీ పరీక్ష పూర్తయింది. మరో 4 వేల పోస్టులకు సంబంధించి ఇంకా ప్రభుత్వ విభాగాల నుంచి సరైన ఫార్మాట్లలో ప్రతిపాదనలు టీఎస్పీఎస్సీకి అందలేదు. ఈ ప్రతిపాదనలు అందిన వెంటనే మిగతా ఉద్యోగాలకు ప్రకటనలు విడుదల చేయాలని కమిషన్ భావిస్తోంది. రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, సాధారణ గురుకులాల్లో కలిపి త్వరలోనే ఒకేసారి 11 వేలకు పైగా పోస్టులకు కలిపి ఉద్యోగ ప్రకటనలు జారీ చేయాలని నియామకబోర్డు ఇటీవల నిర్ణయించింది. అలాగే రాష్ట్ర రోడ్లు భవనాల శాఖలోకొత్తగా 472 పోస్టులను ప్రభుత్వం మంజూరు చేసింది.
వివిధ రకాల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్ కావలసిన క్రింది వాట్స్అప్ గ్రూప్లో చేరండి:
ఉద్యోగ నోటిఫికేషన్ టెలిగ్రామ్ గ్రూపులో చేరండి:
ప్రభుత్వం ఇప్పటివరకు మంజూరు చేసిన నోటిఫికేషన్ వివరాలు:
0 comments:
Post a Comment