APPSC Group 1 Notification
అమెజాన్‌తో కొత్త సంవత్సరాన్ని సెలబ్రేట్ చేసుకోండి | అప్లయన్సెస్ & ఫర్నిచర్‌పై 50% వరకు తగ్గింపు!
APPSC Group 1 Exam : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా జనవరి 8న నిర్వహించే గ్రూపు-1 ప్రిలిమ్స్(స్క్రీనింగ్ టెస్ట్)కు పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) చైర్మన్ గౌతమ్ సవాంగ్ తెలిపారు. 18 జిల్లాల్లో 297 కేంద్రాల్లో 1,26,499 మంది అభ్యర్థులు పరీక్ష రాయనున్నారని.. పరీక్ష జరిగిన 3 వారాల్లోనే ఫలితాలు వెల్లడిస్తామన్నారు. నోటిఫికేషన్‌లో ప్రకటించిన 92 పోస్టులకు అదనంగా మరికొన్ని పోస్టులు కలిసే అవకాశముందని చెప్పారు. కమిషన్ ప్రధాన కార్యాలయంలో గురువారం గౌతమ్‌సవాంగ్ విలేకర్లతో మాట్లాడారు. ‘గ్రూపు-1 ప్రధాన పరీక్షను స్క్రీనింగ్ టెస్ట్ ఫలితాలు వెల్లడించిన 90 రోజుల్లోగా నిర్వహిస్తాం. జవాబుపత్రాల మూల్యాంకనానికి రెండు నెలలు పడుతుంది. తర్వాత నెలలో ఇంటర్వ్యూలు నిర్వహించి, ఆగస్టులోగా నియామకాలు పూర్తిచేస్తాం. రాష్ట్ర ప్రభుత్వం నుంచి పోస్టుల భర్తీకి ఆమోదం లభిస్తే ఈ ఏడాది సెప్టెంబరులో కొత్తగా మరో గ్రూపు-1 నోటిఫికేషన్ జారీచేస్తాం. త్వరలో గ్రూపు-2 నోటిఫికేషన్ ఇస్తాం’ అని గౌతమ్ సవాంగ్ స్పష్టం చేశారు
వివిధ రకాల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్ కావలసిన క్రింది వాట్స్అప్ గ్రూప్లో చేరండి:
ఉద్యోగ నోటిఫికేషన్ టెలిగ్రామ్ గ్రూపులో చేరండి:
0 comments:
Post a Comment