ఆర్మీలో చేరడం మీ లక్ష్యం అయితే.మీరు డిగ్రీ పాసై..ఎన్సీసీ అర్హత ఉంటే చాలు ఆర్మీలో జాయిన్ అవ్వొచ్చు. ఇండియన్ ఆర్మీ షార్ట్ సర్వీస్ కమిషన్ విధానంలో ఏడాదికి రెండుసార్లు ఎన్సీసీ స్పెషల్ ఎంట్రీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తోంది.
డిగ్రీతోపాటు ఎన్సీసీ అర్హత ఉన్నవారు వీటికి దరఖాస్తు చేసుకునేందుకు అర్హలు. అకాడమిక్ మార్కుల ఆధారంగా షార్ట్ లిస్టు చేసి.అందులో సెలక్ట్ అయిన వారికి సెలక్షన్ కేంద్రాల్లో ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అభ్యర్థులకు బెంగుళూరులో మౌఖిక పరీక్ష ఉంటుంది. ఈ ఇంటర్వ్యూలు సైకాలజిస్ట్, గ్రూప్ టెస్టింగ్ ఆఫీసర్ ఆద్వర్యంలో జరుగుతుంది. రెండు దశల్లో ఈ ఇంటర్వ్యూలు ఐదు రోజులపాటు కొనసాగుతాయి. ఈ ఇంటర్వ్యూలో పాస్ అయితేనే వైద్య పరీక్షలు నిర్వహించి శిక్షణలోకి తీసుకుంటారు.
ఎంపికైన అభ్యర్థులకు
ఈ స్పెషల్ ఎంట్రీ విధానంలో సెలక్ట్ అయిన అభ్యర్థులకు ఈ ఏడాది అక్టోబర్ నుంచి ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ చెన్నైలో 49వారాలపాటు శిక్షణ ఇస్తుంది. ఈ సమయంలో ప్రతినెలా రూ. 56100స్టైఫైండ్ కూడా చెల్లించారు. శిక్షణ పూర్తిచేసుకున్నవారికి పోస్టు గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ డిఫెన్స్ మేనేజ్ మెంట్ అండ్ స్ట్రాటజిక్ స్టడిస్ డిగ్రీని మద్రాస్ విశ్వవిద్యాలయం ప్రదానం చేస్తుంది. తర్వాత వీరిని లెఫ్టినెంట్ హోదాలో విధుల్లోకి తీసుకుంటారు. పదేళ్లపాటు వీరు ఉద్యోగంలో కొనసాగుతారు. పదేళ్లుపూర్తయిన తర్వాత సంస్థ అవసరాలు, అభ్యర్థుల ఆసక్తిని బట్టి కొందరిని శాశ్వత ఉద్యోగం కింద తీసుకుంటారు. మిగిలిన అభ్యర్థులను మరో నాలుగేళ్లు సర్వీసులోనే కొనసాగిస్తారు. ఆ తర్వాత వారు వైదొలగాల్సి ఉంటుంది. లెఫ్టినెంట్ గా విధుల్లో చేరినవారు రెండేళ్ల అనుభవంతో కెప్టెన్, ఆరేళ్లకు మేజర్ 13ఏళ్ల సేవలతో లెప్టినెంట్ కల్నల్ హోదాలకు అర్హులు అవుతారు.
పోస్టులు
ఎన్ సీసీ స్పెషల్ ఎంట్రీ
ఖాళీలు 55.
పురుషులు 50, మహిళలకు 5. ఈ రెండు విభాగాల్లో 6 పోస్టులు యుద్ధంలో మరణించిన ఆర్మీ ఉద్యోగుల పిల్లలకు కేటాయిస్తారు.
అర్హత
50శాతం మార్కులతో ఏదైనా డిగ్రీలో ఉత్తీర్ణులై ఉండాలి. ఆఖరి ఏడాది కోర్సులు చదువుతున్నవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఎస్ సీసీ సీనియర్ డివిజన్ వింగ్ లో కొనసాగి ఉండాలి. ఎన్ సీసీ సి సర్టిఫికేట్ లో కనీసం బి గ్రేడ్ పొంది ఉండాలి. యుద్దంలో మరణించిన ఆర్మీ ఉద్యోగుల పిల్లలకు ఎన్ సీసీ సి సర్టిఫికేట్ అవసరం ఉండదు.
వయస్సు
జూలై 1, 2023 నాటికి 19 నుంచి 25ఏళ్ల లోపు ఉండాలి.
ఫిబ్రవరి 15 మధ్యాహ్నం 3 వరకు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తులు స్వీకరిస్తారు. https://www.joinindianarmy.nic.in ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
వివిధ రకాల కేంద్రా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్ లు కావలసినవారు క్రింది వాట్స్అప్ గ్రూప్లో చేరండి:
Job Notifications Telegram Group:
0 comments:
Post a Comment