AP Police Jobs : ఏపీలో 411 ఎస్‌ఐ ఉద్యోగాలు.. డిగ్రీ పాసైన వాళ్లు అప్లయ్‌ చేసుకోవచ్చు

AP Police Recruitment 2023 : ఏపీలో పోలీసు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదలైంది. సివిల్‌, ఏపీఎస్పీ విభాగాల్లో మొత్తం 6,511 పోస్టుల భర్తీకి పోలీసు రిక్రూట్‌మెంట్‌ బోర్డ్‌ (SLPRB AP) తాజాగా నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఇందులో సివిల్‌, ఏపీఎస్పీ విభాగాల్లో 411 ఎస్సై పోస్టులు, 6,100 కానిస్టేబుల్‌ పోస్టులున్నాయి. సివిల్‌ ఎస్సై, ఏపీఎస్పీ ఆర్‌ఎస్సై ఉద్యోగాలకు 2023 ఫిబ్రవరి 19న, సివిల్‌, ఏపీఎస్పీ కానిస్టేబుల్‌ ఉద్యోగాలకు 2023 జనవరి 22న ప్రాథమిక రాతపరీక్ష నిర్వహించనున్నారు. అయితే.. కానిస్టేబుల్‌ ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ ముగిసింది. ఎస్‌ఐ ఉద్యోగాలకు మాత్రం 2023 జనవరి 18వ వరకు అప్లయ్‌ చేసుకోవచ్చు. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు https://slprb.ap.gov.in/ వెబ్‌సైట్ ద్వారా అప్లయ్‌ చేసుకోవాల్సి ఉంటుంది.

విద్యార్హతలు:

సివిల్‌ ఎస్సై, ఏపీఎస్పీ ఆర్‌ఎస్సై ఉద్యోగాలకు డిగ్రీ లేదా తత్సమాన విద్యార్హత ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులైతే ఇంటర్‌ ఉత్తీర్ణులై డిగ్రీ చదివి ఉంటే సరిపోతుంది.

వయోపరిమితి

సివిల్‌ ఎస్సై, ఏపీఎస్పీ ఆర్‌ఎస్సై ఉద్యోగాలకు 21-27 ఏళ్లమధ్య వయసు ఉన్నవారు అర్హులు. 1995 జులై 2 తర్వాత, 2001 జులై 1 కంటే ముందు జన్మించిన వారై ఉండాలి.

ముఖ్యమైన తేదీలు

సివిల్‌ ఎస్సై, ఏపీఎస్పీ ఆర్‌ఎస్సై ఉద్యోగాలకు
దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం: 2022 డిసెంబరు 14 నుంచి

దరఖాస్తుల సమర్పణకు తుది గడువు: 2023 జనవరి 18 వరకు అప్లయ్‌ చేసుకోవచ్చు

ప్రాథమిక రాతపరీక్షకు హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌: 2023 ఫిబ్రవరి 5 నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.

పరీక్ష తేదీ: 2023 ఫిబ్రవరి 19 (ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకూ పేపర్‌-1, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 వరకూ పేపర్‌-2)

ఎంపిక ప్రక్రియ - మూడు దశల్లో ఎంపిక ప్రక్రియ ఉంటుంది. సివిల్‌ ఎస్సై, ఏపీఎస్పీ ఆర్‌ఎస్సై ఉద్యోగాలకు
ప్రాథమిక రాత పరీక్ష: 2 పేపర్లు.. 200 మార్కులకు. బహుళైౖచ్ఛిక విధానంలో ప్రశ్నలు ఉంటాయి.

పేపర్‌-1: పదోతరగతి స్థాయిలో అర్థమెటిక్‌, రీజనింగ్‌, మెంటల్‌ ఎబిలిటీ
పేపర్‌-2: జనరల్‌ స్టడీస్‌ (డిగ్రీ స్థాయిలో)
దేహదారుఢ్య పరీక్షలు
ప్రాథమిక రాతపరీక్షలో అర్హత మార్కులు సాధించిన వారినే దేహదారుఢ్య పరీక్షలకు ఎంపికచేస్తారు.
సివిల్‌ ఎస్సై ఉద్యోగాలకు పోటీపడే అభ్యర్థులు 1,600 మీటర్ల పరుగు నిర్దేశిత సమయంలో పూర్తిచేయాలి. లాంగ్‌జంప్‌ లేదా 100 మీటర్ల పరుగులో ఏదో ఒకటి పూర్తిచేయాలి. వీటిలో అర్హత సాధిస్తే చాలు. తుది ఎంపికకు ఈ మార్కులను పరిగణనలోకి తీసుకోరు.
ఏపీఎస్పీ ఆర్‌ఎస్సై ఉద్యోగాలకు పోటీపడే అభ్యర్థులు 1600 మీటర్ల పరుగు, 100 మీటర్ల పరుగు, లాంగ్‌జంప్‌ మూడూ పూర్తిచేయాలి. 100 మార్కులకు ఈ పరీక్షలు ఉంటాయి. తుది ఎంపికలో ఈ మార్కులను పరిగణనలోకి తీసుకుంటారు.

ఫైనల్‌ రాత పరీక్ష

మొత్తం పేపర్లు: 4 - మార్కులు: 600
పేపర్‌-1: ఇంగ్లిష్‌ (100 మార్కులకు)
పేపర్‌-2 : తెలుగు లేదా ఉర్దూ (100 మార్కులకు)
ఈ రెండు పేపర్లు వివరణాత్మక విధానం (డిస్క్రిప్టివ్‌)లో ఉంటాయి. వీటిలో అర్హత మార్కులు సాధిస్తే చాలు.
పేపర్‌-3 : అర్థమెటిక్‌, రీజనింగ్‌, మెంటల్‌ ఎబిలిటీ (200 మార్కులకు)
పేపర్‌-4 : జనరల్‌ స్టడీస్‌ (200 మార్కులకు)
వీటిల్లో ప్రశ్నలు బహుళైచ్ఛిక విధానంలో ఉంటాయి.
ఆంగ్లం, తెలుగు పేపర్లలో అర్హత సాధించకపోతే మిగతా రెండు పేపర్లను పరిగణనలోకి తీసుకోరు.
పేపర్‌-3, పేపర్‌-4లో 400 మార్కులకు అత్యధిక మార్కులు సాధించినవారిని సివిల్‌ ఎస్సై ఉద్యోగాలకు ఎంపికచేస్తారు.
ఏపీఎస్పీ ఆర్‌ఎస్సై పోస్టులకు పోటీపడేవారికి పేపర్‌-1, పేపర్‌-2 యథాతథంగా ఉంటాయి. పేపర్‌-3, పేపర్‌-4లను చెరో వందమార్కుల చొప్పున 200 మార్కులకు నిర్వహిస్తారు. ఈ పరీక్షలో సాధించిన మార్కులకు దేహదారుఢ్య పరీక్షల్లో వచ్చిన మార్కులను కలుపుతారు. అత్యధిక మార్కులు సాధించినవారిని ఉద్యోగానికి ఎంపికచేస్తారు.

వివిధ రకాల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్ కావలసిన క్రింది వాట్స్అప్ గ్రూప్లో చేరండి:


ఉద్యోగ నోటిఫికేషన్ టెలిగ్రామ్ గ్రూపులో చేరండి:

ఉద్యోగ నోటిఫికేషన్ టెలిగ్రామ్ గ్రూపులో చేరండి:
Official Website and Online Link
Posted in:

Related Posts

0 comments:

Post a Comment

Latest Job Notifications

Subscribe My Whatsapp & Telegram Groups More

Job Related Material

More

Bank Jobs

More
Top