తెలంగాణలో ఉద్యోగాల జాతర కొనసాగుతోంది. తాజాగా మరో వేలకు పైగా ఉద్యోగాల భర్తీకి ప్రకటన విడుదలైంది. తెలంగాణ మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డ్ 5,204 స్టాఫ్ నర్స్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఆర్థిక, ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు ట్విట్టర్ ద్వారా ఇందుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. ఈ ఉద్యోగాలకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ జనవరి 25, 2023వ తేదీ ఉదయం 10.30 గంటలకు ప్రారంభం కానుందని ప్రకటనలో పేర్కొన్నారు.
దరఖాస్తు చేసుకోవడానికి ఫిబ్రవరి 15ను ఆఖరి తేదీగా నిర్ణయించింది మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డ్. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆ రోజు సాయంత్రం 5 గంటలలోగా దరఖాస్తు చేసుకోవాలని స్పష్టం చేశారు
వివిధ రకాల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్ కావలసిన క్రింది వాట్స్అప్ గ్రూప్లో చేరండి:
ఉద్యోగ నోటిఫికేషన్ టెలిగ్రామ్ గ్రూపులో చేరండి:
0 comments:
Post a Comment