ఆంధ్రప్రదేశ్‌లో పదో తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. 2023 ఏప్రిల్ 3వ తేదీ నుంచి పరీక్షలు నిర్వహించనున్నట్లు ప్రకటించింది టెన్త్ బోర్డు.
ఈ మేరకు శుక్రవారం మధ్యాహ్నాం టైం టేబుల్‌ను ప్రకటించింది.
ఏపీలో ఏప్రిల్ 3వ తేదీ నుంచి పదవ తరగతి పరీక్షలు జరగనున్నాయి. ఆరు సబ్జెక్ట్‌లకే పరీక్ష నిర్వహణ ఉండనుందని బోర్డు వెల్లడించింది. అలాగే.. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నాం 12.45 వరకు పరీక్షా సమయంగా నిర్ణయించారు. సిబీఎస్ఈ తరహాలో రోజు విడిచి రోజు పరీక్షలు నిర్వహించనున్నారు.
ఏప్రిల్ 3వ తేదీన ఫస్డ్ లాంగ్వేజ్ పేపర్-1. ఏప్రిల్ ఆరున సెకండ్ లాంగ్వేజ్. 8వ తేదీన ఇంగ్లీష్, 10వ తేదీ లెక్కలు, 13న సైన్స్, 15న సోషల్ స్టడీస్ పరీక్షలు ఉంటాయి. 17వ తేదీన మొదటి లాంగ్వేజ్ పేపర్-2 (కాంపోజిట్ కోర్సు)/ ఓఎస్ఎస్ఇ మెయిన్ లాంగ్వేజ్ పేపర్ -1 నిర్వహిస్తారు. 18వ తేదీన ఓఎస్ఎస్ఇ మెయిన్ లాంగ్వేజ్ పేపర్ -2 ( సంస్కృతం, అరబిక్,పర్షియన్), వొకేషనల్ కోర్సు పరీక్ష ఉండనుంది.
Subscribe My Whatsapp & Telegram Groups
0 comments:
Post a Comment