Group-3 Notifiaction in Telangana : రాష్ట్రంలో ఉద్యోగ ప్రకటనల జాతర కొనసాగుతోంది.
తాజాగా గ్రూప్-3 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. రాష్ట్రంలోని 26 విభాగాల్లో 1,365 పోస్టుల భర్తీకి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రకటన జారీ చేసింది. ఆర్థిక శాఖలో అత్యధికంగా 712 పోస్టులు ఉన్నాయి. జనవరి 24 నుంచి ఫిబ్రవరి 23 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులను స్వీకరించనున్నట్లు టీఎస్‌పీఎస్సీ వెల్లడించింది. గ్రూప్-1, గ్రూప్-2, గ్రూప్-4 ఉద్యోగాల భర్తీకి ఇప్పటికే నోటిఫికేషన్లు విడుదలైన సంగతి తెలిసిందే.
వయోపరిమితి దాటి కొందరు అభ్యర్థులకు నష్టం జరిగే అవకాశం ఉన్నందున.. టీఎస్‌పీఎస్సీ వరుస నోటిఫికేషన్లు జారీ చేస్తోంది. ఎక్కువ మంది అభ్యర్థులు అన్ని పరీక్షలకు పోటీ పడే అవకాశం ఉన్నందున.. పరీక్షల మధ్య గడువు ఇవ్వాలని టీఎస్‌పీఎస్సీ భావిస్తోంది. అందుకే నోటిఫికేషన్లతో పాటు పరీక్ష తేదీలను ప్రకటించడం లేదు
వివిధ రకాల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్ కావలసిన క్రింది వాట్స్అప్ గ్రూప్లో చేరండి:
ఉద్యోగ నోటిఫికేషన్ టెలిగ్రామ్ గ్రూపులో చేరండి:
0 comments:
Post a Comment