కేంద్ర ప్రభుత్వ ఉక్కు మంత్రిత్వ శాఖకు చెందిన బొకారో స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్.. 78 నర్సులు, ఫార్మాసిస్ట్‌లు, ల్యాబొరేటరీ, ఈసీజీ టెక్నీషియన్ తదితర పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది.పోస్టును బట్టి సంబంధిత స్పెషలైజేషన్‌లో బ్యాచిలర్స్ డిగ్రీ/డిప్లొమా/పీజీ డిప్లొమా/ఎంబీఏ/బీబీఏ/పీజీడీసీఏ లేదా లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. సంబంధిత విభాగంలో లైసెన్స్ లేదా సర్టిఫికెట్ కూడ ఉండాలి. అభ్యర్ధుల వయసు 30 ఏళ్లకు మించకుండా ఉండాలి. ఈ అర్హతలున్నవారు సంబంధిత డాక్యుమెంట్లతో డిసెంబర్ 6, 7 తేదీల్లో కింది అడ్రస్‌లో నిర్వహించే ఇంటర్వ్యూకి నేరుగా హాజరుకావచ్చు. ఎంపికైన వారికి నెలకు రూ.12,000ల నుంచి రూ.20,000ల వరకు వరకు జీతంగా చెల్లిస్తారు. ఇతర సమాచారం అధికారిక నోటిఫికేషన్‌లో చెక్ చేసుకోవచ్చు.
ఖాళీల వివరాలు..
నర్సులు పోస్టులు: 40
ఫార్మాసిస్ట్ పోస్టులు: 15
ల్యాబొరేటరీ అండ్ బ్లడ్ బ్యాంక్ టెక్నీషియన్ పోస్టులు: 12
డయాలసిస్ టెక్నీషియన్ పోస్టులు: 2
ఆప్టోమెట్రిస్ట్ పోస్టులు: 2
ఈసీజీ/ఈఈజీ టెక్నీషియన్ పోస్టులు: 2
డ్రెస్సర్ పోస్టులు: 5
అడ్రస్..
BOKARO STEEL PLANT, School of Nursing or Administrative Block, BGH
0 comments:
Post a Comment