ఇండియన్ నేవీ (Indian Navy) నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. సీనియర్ సెకండరీ రిక్రూట్‌మెంట్ (SSR) ద్వారా అగ్నివీర్ పోస్టులను భర్తీ చేయడానికి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ప్రకటించిందిఅర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్లైన్ విధానంలో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అభ్యర్థులు ఇండియన్ నేవీ అధికారిక వెబ్‌సైట్ joinindiannavy.gov.in ని సందర్శించడం ద్వారా దరఖాస్తు (Job Application) చేసుకోవచ్చు. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ డిసెంబర్ 08 నుంచి ప్రారంభమవుతుంది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 1400 పోస్టులు భర్తీ చేయనుంది ఇండియన్ నేవీ.
ఇండియన్ నేవీ SSR రిక్రూట్‌మెంట్ 2022 (Indian Navy SSR Recruitment 2022) ముఖ్యమైన తేదీలు:
ఆన్‌లైన్ దరఖాస్తుకు ప్రారంభ తేదీ - 08 డిసెంబర్
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ - 17 డిసెంబర్
మొత్తం పోస్టుల సంఖ్య - 1400
అర్హత ప్రమాణాలు:
అభ్యర్థులు ఏదైనా గుర్తింపు పొందిన బోర్డు లేదా ఇన్‌స్టిట్యూట్ నుండి మ్యాథ్స్ మరియు ఫిజిక్స్ సబ్జెక్టులతో 12వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి.
వయోపరిమితి:
అభ్యర్థులు తప్పనిసరిగా 01 మే 2002 - 31 అక్టోబర్ 2005 మధ్య జన్మించి ఉండాలి.
ఇండియన్ నేవీ SSR రిక్రూట్‌మెంట్ 2022 (Indian Navy SSR Recruitment 2022) పరీక్ష రుసుము:
అభ్యర్థులకు దరఖాస్తు ఫీజుగా రూ. 550/- చెల్లించాల్సి ఉంటుంది.
ఎంపిక ప్రక్రియ:
షార్ట్‌లిస్టింగ్ (కంప్యూటర్ ఆధారిత ఆన్‌లైన్ పరీక్ష)
- రాత పరీక్ష
- PFT & ప్రిలిమినరీ మెడికల్
- ఫైనల్ రిక్రూట్‌మెంట్ మెడికల్ ఎగ్జామ్
0 comments:
Post a Comment