నార్తర్న్‌ కోల్‌ఫీల్డ్స్‌లో 405 ఉద్యోగాలు

మధ్యప్రదేశ్‌లోని ప్రభుత్వరంగ సంస్థ... నార్తర్న్‌ కోల్‌ఫీల్డ్స్‌ లిమిటెడ్‌ (ఎన్‌సీఎల్‌) నుంచి ఉద్యోగ నియామక ప్రకటన వెలువడింది.
దీని ప్రకారం 405 మైనింగ్‌ సర్దార్‌, సర్వేయర్‌ ఖాళీల భర్తీ చేయనున్నారు. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

తాజా ప్రకటన ప్రకారం... మైనింగ్‌ సర్దార్‌ ఇన్‌ టెక్నికల్‌ అండ్‌ సూపర్‌వైజరీ గ్రేడ్‌-సి పోస్టులు 374 ఉన్నాయి. సర్వేయర్‌ ఇన్‌ టెక్నికల్‌ అండ్‌ సూపర్‌వైజరీ గ్రేడ్‌-బి పోస్టులు 31 ఉన్నాయి. అభ్యర్థుల వయసు 18-30 ఏళ్ల మధ్య ఉండాలి.

అర్హతలు: మైనింగ్‌ సర్దార్‌ పోస్టుకు మెట్రిక్యులేషన్‌/ తత్సమాన పరీక్ష పాసై ఉండాలి. డీజీఎంఎస్‌ జారీచేసిన మైనింగ్‌ సర్దార్‌ సర్టిఫికెట్‌, గ్యాస్‌ టెస్టింగ్‌ సర్టిఫికెట్‌, ఫస్ట్‌ ఎయిడ్‌ సర్టిఫికెట్‌ ఉండాలి. లేదామైనింగ్‌ ఇంజినీరింగ్‌ డిగ్రీ/ డిప్లొమా, ఓవర్‌మ్యాన్స్‌ సర్టిఫికెట్‌ ఆఫ్‌ కాంపిటెన్సీ, గ్యాస్‌ టెస్టింగ్‌ సర్టిఫికెట్‌, ఫస్ట్‌ ఎయిడ్‌ సర్టిఫికెట్‌ ఉండాలి.

* సర్వేయర్‌ ఇన్‌ టెక్నికల్‌ అండ్‌ సూపర్‌వైజరీ గ్రేడ్‌-బి పోస్టుకు మెట్రిక్యులేషన్‌/తత్సమాన పరీక్ష పాసై ఉండాలి. సర్వేయర్స్‌ సర్టిఫికెట్‌ ఆఫ్‌ కాంపిటెన్సీ, డిగ్రీ లేదా డిప్లొమా ఇన్‌ మైనింగ్‌/ మైన్‌ సర్వేయింగ్‌ ఇంజినీరింగ్‌, సర్వేయర్స్‌ సర్టిఫికెట్‌ ఆఫ్‌ కాంపిటెన్సీ (ఎస్‌సీసీ) ఉండాలి

ఎంపిక ఎలా?
కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష (సీబీటీ)లో సాధించిన స్కోరు ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. రెండు పోస్టులకు వేర్వేరుగా సీబీటీని నిర్వహిస్తారు. ఈ పరీక్ష 100 మార్కులకు ఉంటుంది. సమయం 90 నిమిషాలు. రెండు సెక్షన్లు ఉంటాయి. సెక్షన్‌-ఎలో టెక్నికల్‌ నాలెడ్జ్‌కు సంబంధించిన 70 మల్టిపుల్‌ ఛాయిస్‌ ప్రశ్నలు (ఎంసీక్యూ) అడుగుతారు. సెక్షన్‌-బిలో జనరల్‌ నాలెడ్జ్‌, జనరల్‌ అవేర్‌నెస్‌, రీజనింగ్‌, వెర్బల్‌ అండ్‌ నాన్‌ వెర్బల్‌ ఎబిలిటీ, క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌కు సంబంధించిన 30 మల్టిపుల్‌ ఛాయిస్‌ ప్రశ్నలు వస్తాయి. ప్రతి ప్రశ్నకూ ఒక మార్కు. రుణాత్మక మార్కులు లేవు. ప్రశ్నపత్రం హిందీ, ఇంగ్లిష్‌ భాషల్లో ఉంటుంది.

జీతభత్యాలు: మైనింగ్‌ సర్దార్‌కు నెలకు రూ.31,852, సర్వేయర్‌కు నెలకు రూ.34,391 చెల్లిస్తారు.

ఇదీ సిలబస్‌

మైనింగ్‌ సర్దార్‌కు...సెక్షన్‌-ఎలో: ఓపెన్‌కాస్ట్‌ కోల్‌ మైన్‌ వర్కింగ్‌ 2) షాట్‌ ఫైరింగ్‌ అండ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ 3) సేఫ్టీ ఇష్యూస్‌ 4) ప్రిలిమినరీ ఐడియా అబౌట్‌ రిక్లమేషన్‌ ఆపరేషన్‌ ఇన్‌ ఓపెన్‌కాస్ట్‌ మైనింగ్‌ 5) ప్రిలిమినరీ అండర్‌స్టాండింగ్‌ అబౌట్‌ సేఫ్టీ మేనేజ్‌మెంట్‌ ప్లాన్‌ 6) ప్రొవిజన్స్‌ ఆఫ్‌ ది కోల్‌ మైన్స్‌ రెగ్యులేషన్స్‌ 7) రైటింగ్‌ ఆఫ్‌ రిపోర్ట్స్‌ 

సెక్షన్‌-బిలో: 1) జనరల్‌ నాలెడ్జ్‌: భారతదేశం, మన దేశానికి ఇతర దేశాలతో ఉన్న సంబంధాలు, జనరల్‌ సైన్స్‌ మొదలైనవి.
2) జనరల్‌ అవేర్‌నెస్‌: క్రీడలు, రక్షణ, పుస్తకాలు, అవార్డులు, భారతదేశ ప్రజాస్వామ్యం మొదలైనవి.
3) రీజనింగ్‌, వెర్బల్‌ అండ్‌ మెంటల్‌ ఎబిలిటీ, సిననిమ్స్‌ అండ్‌ యాంటనిమ్స్‌ (హిందీ/ఇంగ్లిష్‌), గ్రామర్‌, రిలేషన్‌షిప్‌ మొదలైనవి.
4) క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌: వర్క్‌ రిలేషన్‌షిప్‌, ప్రాఫిట్‌ అండ్‌ లాస్‌, స్పీడ్‌ మొదలైనవి. 
కటాఫ్‌ మార్కులు

మైనింగ్‌ సర్దార్‌ పోస్టుకు అన్‌రిజర్వుడ్‌, ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులు అర్హత పొందాలంటే 50 మార్కులు, ఎస్సీ/ ఎస్టీ/ ఈఎస్‌ఎం/ ఓబీసీ-ఎన్‌సీఎల్‌ అభ్యర్థులైతే 40 మార్కులు సాధించాలి. సర్వేయర్‌ పోస్టుకు కూడా కటాఫ్‌ మార్కులు ఇదేవిధంగా ఉంటాయి.

* సీబీటీ ఫలితాలను ఎన్‌సీఎల్‌ వెబ్‌సైట్‌లో ప్రచురిస్తారు. ఈ పరీక్షలో పాసైనవారు డాక్యుమెంట్ల పరిశీలనకు హాజరుకావాలి. ఆయా తేదీ, సమయాలను వెబ్‌సైట్‌ ద్వారా తెలియజేస్తారు. 

పరీక్ష కేంద్రాలు: ఆన్‌లైన్‌ దరఖాస్తులోని పరీక్ష కేంద్రాల నుంచి అభ్యర్థులు మూడు కేంద్రాలను ఎంచుకోవాలి. ఒకసారి దరఖాస్తు చేసిన తర్వాత వీటిల్లో మార్పు చేసుకోవడానికి అవకాశం ఉండదు.

దరఖాస్తు ఫీజు: రూ.1180 (1000 ఫీజు + 180 జీఎస్టీ) ఆన్‌లైన్‌ విధానంలో చెల్లించాలి. ఎస్సీ/ ఎస్టీ/ పీడబ్ల్యూడీ/ ఈఎస్‌ఎం/ డిపార్ట్‌మెంటల్‌ అభ్యర్థులు ఫీజు చెల్లించనవసరం లేదు.

దరఖాస్తుకు చివరి తేదీ: 22.12.2022

వెబ్‌సైట్‌:http://www.nclcil.in/
Posted in:

Related Posts

0 comments:

Post a Comment

Latest Job Notifications

Subscribe My Whatsapp & Telegram Groups More

Job Related Material

More

Bank Jobs

More
Top