KVS Online Application Process: ఉపాధ్యాయ కొలువులకు ప్రారంభం అయిన రిజిస్ట్రేషన్ ప్రక్రియ.. Step By Step దరఖాస్తు ఇలా..

దేశవ్యాప్తంగా ఉన్న కేంద్రీయ విద్యాలయ సంగఠన్(KVS)లో పలు పోస్టుల భర్తీకి ఇటీవల నోటిఫికేషన్(Notification) జారీ అయింది.ఈ రిక్రూట్‌మెంట్‌ ద్వారా మొత్తంగా 13 వేలకు పైగా ఫోస్టులను భర్తీ చేయనున్నారు. ఇందుకు సంబంధించి తాజాగా రిజిస్ట్రేషన్ ప్రక్రియ డిసెంబర్ 05, 2022 నుంచి ప్రారంభమైంది. ఈ రిక్రూట్‌మెంట్ద్వారా టీజీటీ, పీజీటీ, పీఆర్‌టీ వంటి టీచింగ్, నాన్ టీచింగ్(Non Teaching) పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్‌లో(Online) డిసెంబర్ 26లోపు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ పూర్తి వివరాలు ఇప్పుడు పరిశీలిద్దాం. పోస్టులు ఇలా..

ప్రిన్సిపల్- 239 పోస్టులు, వైస్ ప్రిన్సిపాల్- 203 పోస్టులు, పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్(పీజీటీ)-1409 పోస్టులు, ట్రైన్డ్‌ గ్రాడ్యుయేట్ టీచర్(టీజీటీ)- 3176 పోస్టులు, ప్రైమరీ టీచర్(పీఆర్‌టీ)-6414, లైబ్రేరియన్- 355 పోస్టులు, అసిస్టెంట్ కమిషనర్- 52 పోస్టులు, పీఆర్‌టీ(మ్యూజిక్‌)- 303 పోస్టులు, ఫైనాన్స్ ఆఫీసర్- 06 పోస్టులు, అసిస్టెంట్ ఇంజినీర్(సివిల్)- 02 పోస్టులు, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్(ఏఎస్‌వో)-156 పోస్టులు, హిందీ ట్రాన్స్‌లేటర్‌- 11 పోస్టులు, సీనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్(యూడీసీ)- 322 పోస్టులు, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్(ఎల్‌డీసీ)- 702 పోస్టులు, స్టెనోగ్రాఫర్ గ్రేడ్-2-54 పోస్టులను భర్తీ చేయనున్నారు. 

అర్హత ప్రమాణాలు..

పోస్టులు ఇలా..

పోస్టును బట్టి పదోతరగతి, ఇంటర్‌, డిగ్రీ, పీజీ, బీఈడీ, బీపీఈడీ, డిప్లొమా, పీజీ డిప్లొమా, సీఏ/ ఐసీడబ్ల్యూఏ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అంతేకాకుండా సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (సీటెట్‌) పేపర్-2 క్వాలిఫై అయి ఉండాలి. PGT(పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్) పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలంటే అభ్యర్థుల వయసు 40 ఏళ్లకు మించకూడదు. TGT(ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్), లైబ్రేరియన్‌ పోస్టులకు 35 సంవత్సరాలు, PRT పోస్టులకు 30 ఏళ్లు మించకూడదు. 

దరఖాస్తు ప్రక్రియ ఇలా..

Step 1: ముందుగా అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ను సందర్శించాలి. దీని కోసం ఇక్కడ క్లిక్ చేయండి. 

Step 2: ఇక్కడ అనౌన్స్ మెంట్ అనే విభాగంలో వివిధ విభాగాలకు సంబంధించి పోస్టుల ఆన్ లైన్ అప్లై అనే ఆప్షన్స్ కనిపిస్తాయి. దీనిలో మీకు తగిన భాగం ఎంచుకోవాలి. 
Step 3: పీటీటీ, ప్రిన్సిపల్స్, టీజీటీ, నాన్ టీచింగ్ వంటి విభాగాల్లో మీరు దేనికి దరఖాస్తు చేస్తారో దానిని ఎంచుకోవాలి. 

Step 4: మీరు ఒక వేళ నాన్ టీచింగ్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకుంటే.. ఇక్కడ డైరెక్ట్ గా క్లిక్ చేసి.. దరఖాస్తు చేసుకోవచ్చు. 

Step 5: దీనిలో న్యూ రిజిస్ట్రేషన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. మీ యొక్క వివరాలను నమోదు చేయాలి. తర్వాత మీ యొక్క మొబైల్ నంబర్, ఈ మెయిల్ కు పాస్ వర్డ్, యూజర్ నేమ్ వస్తుంది. 

Step 6: పాస్ వర్డ్, యూజర్ నేమ్ ఉపయోగించి ఇక్కడ క్లిక్ చేసి లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. దీనిలో అర్హతకు సంబంధించి పూర్తి వివరాలను నమోదు చేసి.. సబ్ మిట్ చేయాలి. 

Step 7: చివరగా.. మీ అప్లికేషన్ ఫారమ్ ను డౌన్ లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకోండి.
Posted in:

Related Posts

0 comments:

Post a Comment

Latest Job Notifications

Subscribe My Whatsapp & Telegram Groups More

Job Related Material

More

Bank Jobs

More
Top