AP రాష్ట్ర పరిధిలోని విశాఖపట్నంలోని గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ పారిశుద్ధ్య విభాగంలో ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన 482 పారిశుద్ధ్య కార్మికులు పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టులక దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులకు ప్రభుత్వం జారీ చేసిన బీపీఎల్ కార్డు ఉండాలి. ఫిజికల్ ఫిట్‌నెస్ సర్టిఫికేట్ కూడా ఉండాలి. అలాగే పారిశుద్ధ్య నిర్వహణలో అనుభవం ఉండాలి. అభ్యర్ధుల వయసు తప్పనిసరిగా 18 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి.
ఆసక్తి కలిగిన అభ్యర్ధులు దరఖాస్తుతోపాటు ఫిజికల్ ఫిట్‌నెస్ సర్టిఫికేట్, కుల ధృవీకరణ సర్టిఫికెట్, బీపీఎల్ కార్డు, ఆధార్‌కార్డు, విద్యార్హతలకు సంబంధించిన ఇతర సర్టిఫికెట్లను ఆఫ్‌లైన్ విధానంలో కింది అడ్రస్‌కు డిసెంబర్ 9, 2022వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు దరఖాస్తులు పంపించవల్సి ఉంటుంది. విద్యార్హతలు ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. ఎంపికైన వారికి నెలకు రూ.15,000ల జీతంతోపాటు ఇతర అలవెన్సులు చెల్లిస్తారు.ఇతర సమాచారం అధికారిక నోటిఫికేషన్‌లో చెక్ చేసుకోవచ్చు.
అడ్రస్..
విశాఖపట్నం నగర పాలక సంస్థ ప్రధాన కార్యాలయం, తెన్నేటి విశ్వనాధ భవనం, ప్రజారోగ్య విభాగం, రూమ్ నెంబర్-216, ఆంధ్రప్రదేశ్.
Subscribe My Whatsapp & Telegram Groups
0 comments:
Post a Comment