ప్రభుత్వ కళాశాల (Govt College)ల్లో ఇంటర్మీడియట్ (Intermediate) చదువుతోన్న విద్యార్థులకో శుభవార్త. ఇంటర్ విద్యార్హత (Inter qualification)తోనే సాఫ్ట్‌వేర్ ఉద్యోగం (software job) పొందేలా రాష్ట్ర ప్రభుత్వం(Telangana Govt.) చర్యలు తీసుకుంది. ఇందుకోసం హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ సంస్థ(HCL Technologie company)తో ఓ అవగాహన ఒప్పందం చేసుకుంది. దీని ప్రకారం ప్రభుత్వ జూనియర్ కళాశాలలకు చెందిన 20 వేల మంది విద్యార్థులకు ఏటా ఉద్యోగావకాశం కల్పించనున్నామని విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి(Sabita Indra Reddy) తెలిపారు. ఇందుకు సంబంధించి ప్రభుత్వ కార్యదర్శి వాకాటి కరుణ, ఇంటర్మీడియట్ బోర్డు ఇన్‌చార్జి కార్యదర్శి నవీన్ మిట్టల్(Naveen Mittal)తో గురువారం ఆమె సమీక్షించారు. హెచ్‌సీఎల్‌తో కుదిరిన ఒప్పందం ప్రకారం గణితం సబ్జెక్టు కలిగి ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఇంటర్ సెకండియర్ చదువుతున్న విద్యార్థులకు ఫిబ్రవరిలో ఓ ఆన్‌లైన్ పరీక్ష నిర్వహిస్తున్నామని ఆమె వెల్లడించారు.
ఈ పరీక్షలో కనీసం 60 శాతం మార్కుల సాధించిన విద్యార్థులకు హెచ్‌సీఎల్ సంస్థ వర్చువల్‌గా ఇంటర్వ్యూ నిర్వహించి సాఫ్ట్‌వేర్ ఉద్యోగానికి ఎంపిక చేస్తుందని తెలిపారు. ఎంపికైన విద్యార్థులకు ఆరు నెలల ఆన్‌లైన్‌లో శిక్షణ తరగుతులు జరుగుతాయన్నారు. శిక్షణ పూర్తి చేసుకున్న వారికి హెచ్‌సీఎల్ కార్యాలయంలో ఆరు నెలల పాటు ఇంటర్న్‌షిప్ చేసే అవకాశమిస్తారని అన్నారు. ఈ ఆరు నెలలు నెలకు రూ.10 వేల చొప్పున స్టైఫండ్ కూడా ఇస్తారని తెలిపారు. ఇంటర్న్‌షిప్ పూర్తి కాగానే రూ. 2.5 లక్షల వార్షిక వేతనంతో పూర్తి స్థాయి ఉద్యోగ అవకాశం కల్పిస్తారని పేర్కొన్నారు. ఇలా ఎంపికైన విద్యార్థులు విధులు నిర్వహిస్తూనే బిట్స్, శాస్త్ర, అమిటి యూనివర్సిటీల్లో ఇంటిగ్రేటెడ్ డిగ్రీ పూర్తి చేేసందుకు అవకాశం కల్పిస్తారని మంత్రి వివరించారు. కాగా తెలంగాణ వైతాళికుల జయంతుల క్యాలెండర్‌ను మంత్రి సబితా ఇంద్రారెడ్డి గురువారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తేజోమూర్తుల చరిత్రను నేటి తరానికి తెలియజేయాలనే ఉద్దేశంతో పాఠశాలల్లో ప్రతి రోజు జరిగే అసెంబ్లీలో తెలంగాణ సాహితీమూర్తుల జయంతి, వర్ధంతిని నిర్వహించనున్నామని తెలిపారు
0 comments:
Post a Comment