జనవరి 8న ఏపీపీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్ష..హాల్ టికెట్ లు విడుదల.. పూర్తి వివరాలివే

ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) గ్రూప్ 1 పోస్టులకు నోటిఫికేషన్ విడజుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ పోస్టులకు గానూ ఆన్ లైన్ ద్వారా ధరఖాస్తుల స్వీకరణ నవంబర్ 5వ తేేదీతో ముగిసింది.ఇక గ్రూపు 1 నియామక ప్రక్రియలో మొదటి దశ అయిన ప్రిలిమ్స్ పరక్ష జనవరి 8వ తేదీ నిర్వహించనున్నట్లు ఏపీపీఎస్సీ తాజాగా వెల్లడించింది. ప్రిలిమినరీ పరీక్షలకు సంబంధించి హాల్ టికెట్ లు డిసెంబర్ 31వ తేదీ నుండి ఏపీపీఎస్సీ వెబ్ సైట్ https://psc.ap.gov.in/ లో అందుబాటులో ఉంటాయి.

ప్రిలిమినరీ పరీక్ష రెండు పేపర్లకు నిర్వహిస్తారు. మొదటి పేపరు జనవరి 8వ తేదీ ఉదయం 10 గంటల నుండి 12 గంటల వరకూ, రెండో పేపర్ మధ్యాహ్నం 2 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకూ నిర్వహిస్తారు. ఈ పరీక్షల నిర్వహణకు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 18 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు అధికారులు వెల్లడించారు. ఇతర వివరాలకు ఏపీపీఎస్సీ అధికారిక వెబ్ సైట్ లో చెక్ చేసుకోవచ్చు .

Posted in:

Related Posts

0 comments:

Post a Comment

Latest Job Notifications

Subscribe My Whatsapp & Telegram Groups More

Sponsered Links

Sponsered Links

Job Related Material

More

Bank Jobs

More
Top