అనంతపురము జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖాధికారి వారి పరిధిలో గల మునిసిపాలిటి/ మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలో స్లమ్/వార్డులో 85 Rural & 09 Urban ఆశా కార్యకర్త ఖాళీలను భర్తీ చేయుటకు నిర్ణయించడమైనది. సదరు స్లమ్ / వార్డుల్లో నివసించే అర్హత గల మహిళా అభ్యర్థుల నుండి ధరకాస్తులు కోరబడుచున్నవి. అభ్యర్థులు తమ ధరకాస్తులను 11-12-2022 తేదీలోపుగా ఆ స్లమ్ పరిధిలో ఉన్న PHC / UPHC మెడికల్ ఆఫీసర్ గారికి స్వయముగా అందచేసి రశీదు పొందగలరు. నిర్ణీత గడువు ముగింపుతర్వాత అభ్యర్థుల ధరకాస్తులు స్వీకరించబడవు. ఖాళీల పూర్తి వివరములకు జిల్లా అధికారిక వెబ్ సైట్ ను సందర్శించ గలరు).
https://ananthapuramu.ap.gov.in అభ్యర్థులకు కావలసిన అర్హతలు:
1. తప్పనిసరిగా మహిళా అభ్యర్థి, సంభంధిత స్లమ్ /వార్డు లో నివసిస్తూ, 25సం|| నుండి 45 సం|| వయసు
కలిగి, వివాహితై ఉండాలి. 2. వితంతువులు, విడాకులు పొందిన, భర్తనుండి విడిపోయిన లేదా నిరాశ్రయురాలైన మహిళలకు ప్రాధాన్యత.ఇవ్వబడును.
3. పదవ తరగతి ఉత్తీర్ణత కలిగి ఉండాలి.
4. తెలుగు బాగా చదవడం, రాయడం తప్పనిసరిగా వచ్చి ఉండాలి.
5. ఆరోగ్యం, సంక్షేమం, పారిశుధ్యం, గర్భిణీ స్త్రీల ఆరోగ్యం వంటి సమస్యలపై అవగాహన, చక్కగా ఇతరులకు వివరించే తత్వం, నాయకత్వ లక్షణం, సమస్యల పరిష్కారానికి తగు చొరవ సానుకూల ధృక్పథం కలిగి ఉండాలి.
6. ప్రభుత్వేతర స్వచ్చంద సంస్థల నందు పనిచేసిన / చేస్తున్న వారికి ప్రాధాన్యత ఇవ్వబడును. ధరఖాస్తుతో పాటు
అందచేయ వలసిన ధృవ పత్రములు:
1. నివాస ధృవీకరణ పత్రము ( తహశీల్దారు ద్వారా జారీ చేయబడిన నివాస ధృవీకరణ పత్రము/రేషన్
కార్డు/ బి.పి.యల్ కార్డు/వోటరు కార్డు/ ఆధార్ కార్డు / బ్యాంక్ పాసు పుస్తకము)
2. 10 వ తరగతి సర్టిఫికేట్ కాపీ,
3. ప్రభుత్వేతర స్వచ్ఛంద సంస్థల నందు పనిచేసిన / చేస్తున్నట్లుగా ధృవీకరణ పత్రము కాఫీ,
4. 5సంll లోపు పిల్లలు ఉన్నట్లయితే పూర్తిగా వయసుకు తగ్గ టీకాలు ఇప్పించినట్లుగా తగు ధృవ పత్రం/మాతా శిశు సంరక్షణ కార్డు కాఫీ, 5. వైవాహిక స్థితి: వితంతువు/విడాకులు పొందిన/భర్తనుండి విడిపోయిన/ లేదా నిరాశ్రయురాలైనట్లయితే, వైవాహిక స్థితికి సంభంధించిన స్వంత డిక్లరేషన్.
సూచన: పై నియామకమునకు సంభంధించిన ఖాళీలు / అర్హత నిభంధనలలో మార్పులు, చేర్పులు చేయుటకు లేదా యెటువంటి కారణములు చూపకుండానే ఈ నియామకపు ప్రకటనను రాద్దు చేసే అధికారము వైరస్ / డిస్ట్రిక్ట్ హెల్త్ సొసైటి / సిటీ హెల్త్ సొసైటి వారికి కలదని తెలియపరచడమైనది.
వివిధ రకాల ఉద్యోగ నోటిఫికేషన్ కావలసినవారు క్రింది వాట్సాప్ గ్రూప్ లో చేరండి....
0 comments:
Post a Comment