కడప జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఆశ వర్కర్ల పోస్ట్లు భర్తీ చేయడానికి నోటిఫికేషన్

కడప జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఆశ కార్యకర్తల భర్తీ నిమిత్తము కడప జిల్లాలో PHCs/
UPHCsలో వార్డ్ సెక్రటేరియట్/గ్రామాలలో అర్బన్ మరియు రూరల్ ఆశ కార్యకర్తలను భర్తీ చేయుటకు
అభ్యర్థినులుకు ఉండవలసిన విద్యార్హతలు, జీతము మొదలగు వివరములు దరఖాస్తు నమునాతో పాటు, https://kadapa.ap.gov.in వెబ్ సైట్ నందు పొందుపరచడమైనది.

కావున, అర్హత మరియు ఆసక్తి కలిగిన అభ్యర్థినులుకు https://kadapa.ap.gov.in వెబ్ సైట్ నుండి నిర్ణీత దరఖాస్తు నమూనాను డౌన్లోడ్ చేసుకొని, పూరించిన తమ దరఖాస్తుతో పాటు అవసరమైన సర్టిఫికెట్ల జీరాక్స్ కాఫీలు మరియు తమ విద్యార్హతలకు సంబంధించిన మార్కుల జాబితా జిరాక్స్ కాపీలతో

12-12-- 2022 తేది లోపుగా గ్రామంలో / slum / వార్డ్ సెక్రటేరియట్ పరిధిలో ఉన్న PHC/ UPHC మెడికల్ ఆఫీసర్ గారికి స్యయముగా అందజేసి రశీదు పొందగలరు. నిర్ణీత గడువు ముగింపు తర్వాత అభ్యర్థుల దరఖాస్తులు స్వీకరింపబడవు.

గమనిక :- ఖాళీల జాబితా నందు సూచించిన స్థానిక వార్డు సెక్రటేరియట్/ గ్రామాలలో లలో నివాసం ఉండే అభ్యర్థినులు మాత్రమే దరఖాస్తు చేసుకొనుటకు అర్హులు. వేరే గ్రామానికి మరియు వార్డ్ నకు చెందిన అభ్యర్థుల దరఖాస్తులు పరిగణలోకి తీసుకొనబడవు.

నివాస ధృవీకరణ పత్రం లోని అడ్రస్సు ఖాళీల జాబితా నందు సూచించిన అడ్రస్సు ఒకేలా ఉండాలి. అభ్యర్థులకు కావాల్సిన అర్హతలు:

> తప్పనిసరిగా మహిళ అభ్యర్థి, సంబంధిత slum/గ్రామాలలో/ వార్డ్ లలో నివసిస్తూ 25 సం //నుండి 45 సం // వయస్సు కలిగి, వివాహిత అయి ఉండాలి.

> పదవ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి.

> తెలుగు బాగా రాయడం, చదవడం తప్పనిసరిగా వచ్చి ఉండాలి.

> గతంలో ఆశా కార్యకర్త గా పని చేసిన అనుభవం ఉన్న వారికి ప్రాధాన్యత ఇవ్వబడును.

> ప్రభుత్వేతర/ స్వచ్చంద సంస్థల నాందు పనిచేసిన/ చేస్తున్న వారికి ప్రాధాన్యత ఇవ్వబడుతుంది.

దరఖాస్తు తో పాటు అందజేయవలసిన ధృవపత్రములు:

> నివాస ధృవీకరణ పత్రం (Recent Residence Certificate attested by Ward Administrator / Digital Assistants of Concerned Ward Secretaries &concerned

Grama Sachivalayam. 
> ఆధార్ కార్డు నకలు కాపీ,

> 10వ తరగతి ఉత్తీర్ణులైన మార్కుల నకలు కాపీ.

> పూర్వము ఆశా కార్యకర్త గా పనిచేసిన అనుభవం కాపీ (మెడికల్ ఆఫీసర్ సంతకం తో).

> ప్రభుత్వేతర స్వచ్చంద సంస్థల నాందు పనిచేసిన / చేస్తున్న అనుభవం కాపీ.

వివిధ రకాల ఉద్యోగ నోటిఫికేషన్ కావలసినవారు క్రింది వాట్సాప్ గ్రూప్ లో చేరండి....


Posted in:

Related Posts

0 comments:

Post a Comment

Latest Job Notifications

Subscribe My Whatsapp & Telegram Groups More

Sponsered Links

Sponsered Links

Job Related Material

More

Bank Jobs

More
Top