AAI Recruitment: ఎయిర్‌పోర్ట్స్ అథారిటీలో 596 జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలు

ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా దేశ వ్యాప్తంగా ఉన్న ఏఏఐ కార్యాలయాల్లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. 60శాతం మార్కులతో బీఈ, బీటెక్(సివిల్/ఎలక్ట్రికల్/ఎలక్ట్రానిక్స్/టెలికమ్యూనికేషన్స్/ఆర్కిటెక్చర్) ఉత్తీర్ణత కలిగిన అభ్యర్థులు దరఖాస్తుచేసుకోవడానికి అర్హులు.సరైన అర్హతలు గల అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా డిసెంబరు 22 నుంచి జనవరి 21లోగా దరఖాస్తుచేసుకోవచ్చు. 
వివరాలు..

మొత్తం ఖాళీలు: 596

1. జూనియర్ ఎగ్జిక్యూటివ్ (ఇంజినీరింగ్- సివిల్): 62 పోస్టులు

2. జూనియర్ ఎగ్జిక్యూటివ్ (ఇంజినీరింగ్- ఎలక్ట్రికల్): 84 పోస్టులు

3. జూనియర్ ఎగ్జిక్యూటివ్ (ఎలక్ట్రానిక్స్): 440 పోస్టులు

4. జూనియర్ ఎగ్జిక్యూటివ్ (ఆర్కిటెక్చర్): 10 పోస్టులు

అర్హత:60శాతం మార్కులతో బీఈ, బీటెక్(సివిల్/ఎలక్ట్రికల్/ఎలక్ట్రానిక్స్/టెలికమ్యూనికేషన్స్/ఆర్కిటెక్చర్) ఉత్తీర్ణత కలిగి ఉండాలి.

వయోపరిమితి:21/01/2023 నాటికి 27 సంవత్సరాలు మించకూడదు. ఓబీసీలకు మూడేళ్లు, ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, దివ్యాంగులకు పదేళ్ల వయో సడలింపు ఉంటుంది.

జీత భత్యాలు:నెలకు రూ.40,000-1,40,000 చెల్లిస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తుచేసుకోవాలి.

దరఖాస్తు ఫీజు:రూ.300(ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంది.

ఎంపిక విధానం: గేట్(2020/ 2021/ 2022) స్కోరు, డాక్యుమెంట్ వెరిఫికేషన్ తదితరాల ఆధారంగా ఎంపిక చేస్తారు.

ముఖ్యమైన తేదీలు..

ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ: 22.12.2022.

ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 21.01.2023.
Official Website: Click Here

వివిధ రకాల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగ నోటిఫికేషన్ లు కావాల్సిన వారు క్రింది వాట్సాప్ గ్రూప్ లో చేరండి


Posted in:

Related Posts

0 comments:

Post a Comment

Latest Job Notifications

Subscribe My Whatsapp & Telegram Groups More

Job Related Material

More

Bank Jobs

More
Top