తెలంగాణలో గ్రూప్-2 నోటిఫికేషన్ విడుదల: 783 పోస్టులకు 18 నుంచి అప్లై చేసుకోవచ్చు

తెలంగాణలో గ్రూప్-2 నోటిఫికేషన్ కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు ఇది శుభవార్తే. తాజాగా, 783 పోస్టుల భర్తీకి గ్రూప్ -2 నోటిఫికేషన్ను టీఎస్పీఎస్సీ విడుదల చేసింది. జనవరి 18 నుంచి అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తులను స్వీకరించనున్నారు. మరిన్ని వివరాల కోసం www.tspsc.gov.in సంప్రదించవచ్చు.

టీఎస్పీఎస్సీ రెండు కొత్త నోటిఫికేషన్లు: 276 పోస్టులు

విద్య, వ్యవసాయ శాఖలో 276 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు జారీ అయ్యాయి. ఇంటర్ విద్యాశాఖలో 91, సాంకేతిక విద్యాశాఖలో 37 ఫిజికల్ డైరెక్టర్ పోస్టులు, వ్యవసాయ శాఖలో 148 వ్యవసాయాధికారుల పోస్టుల భర్తీకి ఈ నోటిఫికేషన్లు వెలువడ్డాయి.

ఫిజికల్ డైరెక్టర్ పోస్టులకు పోటీ పడే అభ్యర్థుల వయస్సు 01-07-2022 నాటికి 18-44 ఏళ్ల మధ్య ఉండాలి.
ఈ పోస్టులకు దరఖాస్తులను జనవరి 6, 2023 నుంచి జనవరి 27 సాయంత్రం 5 గంటల వరకు స్వీకరిస్తారు.

అగ్రికల్చర్ ఆఫీసర్ పోస్టులకు ఆన్లైన్లో జనవరి 10 నుంచి జనవరి 30, 2023, సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

పోస్టుల వివరాలు:
సాంకేతిక విద్యలో ఫిజికల్ డైరెక్టర్ : 37
ఇంటర్మీడియట్ విద్యలో ఫిజికల్ డైరెక్టర్ : 91
మొత్తం : 128
అగ్రికల్చర్ ఆఫీసర్ పోస్టులు మల్టీజోన్ -1 : 100
మల్టీజోన్ -2 : 48
మొత్తం : 148.

దరఖాస్తులు ప్రారంభం: 18.02.23

మరిన్ని వివరాల కోసం www.tspsc.gov.in వెబ్సైట్ను చూడాలని టీఎస్పీఎస్సీ కార్యదర్శి అనితారామచంద్రన్ సూచించారు.
Posted in:

Related Posts

0 comments:

Post a Comment

Latest Job Notifications

Subscribe My Whatsapp & Telegram Groups More

Sponsered Links

Sponsered Links

Job Related Material

More

Bank Jobs

More
Top