APPSC Group 1 Hall Ticket 2022 : త్వరలో ఆంధ్రప్రదేశ్‌ గ్రూప్‌ 1 హాల్‌టికెట్లు విడుదల.. పూర్తి వివరాలివే

APPSC Group 1 Hall Ticket :ఏపీపీఎస్సీ గ్రూప్‌ 1 హాల్‌టికెట్లు త్వరలో విడుదలకానున్నాయి. APPSC Group 1 Prelims Exam 2023, జనవరి 8వ తేదీన జరుగనున్నట్లు ఇప్పటికే ఏపీపీఎస్సీ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ పరీక్షకు వారం రోజుల ముందు హాల్‌టికెట్లు విడుదల కానున్నాయి. అంటే జనవరి 1 లేదా 2 తేదీల్లో హాల్‌టికెట్లు విడుదల కానున్నాయి. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో గ్రూప్‌–1 ఉద్యోగాల‌ భర్తీకి ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్ (APPSC) నోటిఫికేషన్‌ విడుదల చేసిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో అత్యున్న ఉద్యోగాల కోసం నిర్వహించే ఈ గ్రూప్ 1 నోటిఫికేషన్ (APPSC Group 1 Notification) ద్వారా 92 పోస్టులను భర్తీ చేస్తారు. ఈ పోస్టులకు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ కూడా ముగిసిన విషయం తెలిసిందే. అభ్యర్థులు ఎప్పటికప్పుడు పూర్తి వివరాలను కమిషన్‌ వెబ్‌సైట్‌ https://psc.ap.gov.in/ లో చూడొచ్చు.

జోన్ల వారీగా పోస్టుల ఎంపిక ఉంటుంది
జోన్‌-1: శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయనగరం
జోన్‌-2: తూర్ప గోదావరి, వెస్ట్‌ గోదావరి, కృష్ణ
జోన్‌-3: గుంటూరు, ప్రకాశం, నెల్లూరు
జోన్‌-4: చిత్తూరు, కడప, అనంతపూర్‌, కర్నూలు
APPSC Group -1 తో సహా అత్యున్నత కేడర్‌ పోస్టులకు ఇంటర్వ్యూలు:
ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్ (APPSC) ద్వారా నిర్వహించే గ్రూప్‌–1 సహా ఇతర అత్యున్నత కేడర్‌ పోస్టులకు రాత పరీక్షలతో పాటు ఇంటర్వ్యూలను కూడా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. గతంలో రద్దు చేసిన ఇంటర్వ్యూల విధానాన్ని పునరుద్ధరించింది. ఈ అత్యున్నత పోస్టులన్నింటికీ ప్రిలిమ్స్, మెయిన్స్‌లలో అర్హత సాధించిన అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహించేలా సెప్టెంబ‌ర్ 30వ తేదీన‌ ఉత్తర్వులు జారీ చేసింది.
Posted in:

Related Posts

0 comments:

Post a Comment

Latest Job Notifications

Subscribe My Whatsapp & Telegram Groups More

Job Related Material

More

Bank Jobs

More
Top