IIBF Vacancies : ముంబాయిలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ లో ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 10 జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీ చేపట్టనున్నారు.ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతున్నారు.
కామర్స్/ఎకనామిక్స్/బిజినెస్ మేనేజ్‌మెంట్/ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ/కంప్యూటర్ సైన్స్/కంప్యూటర్ అప్లికేషన్స్ స్పెషలైజేషన్‌లో గ్రాడ్యుయేషన్ డిగ్రీ, ఎంకాం/ఎకనామిక్స్‌లో ఎంఏ/ఎంబీఏ/సీఏ/సీఎంఏ/సీఎస్/సీఎఫ్‌ఏ లేదా తత్సమాన కోర్సులో కనీసం 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత కలిగిన అభ్యర్ధులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అలాగే సంబంధిత విభాగంలో పని అనుభవం కూడా ఉండాలి.
ఆన్‌లైన్ రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. డిసెంబర్ 17వ తేదీన రాత పరీక్ష ఉంటుంది. ఎంపికైన వారికి నెలకు రూ.28,300ల నుంచి రూ.91,300ల వరకు జీతంగా చెల్లిస్తారు. అభ్యర్ధుల వయసు 28 ఏళ్లకు మించకుండా ఉండాలి. ఈ అర్హతలు కలిగిన అభ్యర్ధులు నవంబర్ 30, 2022వ తేదీలోపు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవల్సి ఉంటుంది. పూర్తి వివరాలకు వెబ్ సైట్ ; https://www.iibf.org.in/recruitment పరిశీలించగలరు.
Subscribe My Whatsapp & Telegram Groups
0 comments:
Post a Comment