ఇండియన్ నేవీలో 100 అగ్నివీర్ (MR)పోస్టులు

కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన అగ్నిపథ్ స్కీమ్ లో భాగంగా, భారత నౌకాదళంలో అగ్నివీర్ (MR) ఖాళీల నియామకానికి ప్రకటన వెలువడింది.ఈ నోటిఫికేషన్ ద్వారా 100 ఖాళీలను భర్తీ చేయనున్నారు.

ఖాళీల వివరాలు: 

అగ్నివీర్ (MR-మెట్రిక్ రిక్రూట్ ) - 100 పోస్టులు (పురుషులు - 80, మహిళలు - 20) 

అర్హత: పదో తరగతి లేదా తత్సమాన కోర్సు ఉత్తీర్ణులై ఉండాలి. 

వయసు: అభ్యర్థి 1.05.2002 నుంచి 31.10.2005 మధ్యలో జన్మించి ఉండాలి. అవివాహిత పురుష, మహిళా అభ్యర్థులు మాత్రమే అవకాశం. 

కనిష్ఠ ఎత్తు ప్రమాణాలు: పురుషులు 157 సెం.మీ.. స్త్రీలు 152 సెం.మీ ఉండాలి. ఎంపిక ప్రక్రియ: షార్ట్ లిస్టింగ్, కంప్యూటర్ ఆధారిత ఆన్‌లైన్ పరీక్ష (సీబీఈ), రాత పరీక్ష, శారీరక దారుఢ్య పరీక్ష (పీఎఫ్ టీ), వైద్య పరీక్షల ఆధారంగా ఎంపిక చేస్తారు. 

వేతనం: ఎంపికైన అభ్యర్థులకు మొదటి ఏడాది రూ. 30 వేలు, రెండో ఏడాది రూ. 33 వేలు, మూడో ఏడాది రూ. 36,500, నాలుగో ఏడాది రూ. 40 వేల వేతనం లభిస్తుంది. 

రాత పరీక్ష విధానం: (సిబిటి): 

ప్రశ్నపత్రం హిందీ/ఇంగ్లీష్ భాషల్లో మొత్తం 50 ప్రశ్నలు ఇస్తారు. ఒక్కొక్కటి 1 మార్కు చొప్పున 50 ప్రశ్నలుంటాయి. 

సైన్స్, మ్యాథమెటిక్స్, జనరల్ అవేర్‌నెస్.. విభాగాల్లో పదో తరగతి స్థాయిలో ప్రశ్నలుంటాయి. 

పరీక్ష సమయం: ఒక గంట. 
నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. నాలుగు తప్పు సమాధానాలకు ఒక మార్కు కోత ఉంటుంది. 

దరఖాస్తు: నేవీ అధికారిక వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేయాలి. 

ఆన్‌లైన్ దరఖాస్తు, ఫీజు చెల్లింపు ప్రారంభం: డిసెంబర్ 8, 2022. 

చివరి తేదీ: డిసెంబర్ 17, 2022. 

శిక్షణ ప్రారంభం: మే, 2023. 

వెబ్‌సైట్:https://www.joinindiannavy.gov.in
Posted in:

Related Posts

0 comments:

Post a Comment

Latest Job Notifications

Subscribe My Whatsapp & Telegram Groups More

Job Related Material

More

Bank Jobs

More
Top