IBPS SO Recruitment 2022: ప్రభుత్వ బ్యాంకుల్లో 710 స్పెషలిస్టు ఆఫీసర్‌ ఉద్యోగాలకు ఐబీపీఎస్ నోటిఫికేషన్ విడుదల.. పూర్తి వివరాలివే..

బారత ప్రభుత్వ ఆర్థిక మంత్రిత్వ శాఖకు చెందిన ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ బ్యాంకింగ్‌ పర్సనల్‌ సెలెక్షన్‌ 2023-24 ఆర్ధిక సంవత్సరానికిగానూ..
710 స్పెషలిస్టు ఆఫీసర్‌ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు పోస్టును బట్టి ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్‌స్టిట్యూట్ నుంచి బ్యాచిలర్స్‌ డిగ్రీ, పీజీ లేదా తత్సమాన డిగ్రీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. దరఖాస్తుదారుల వయసు నవంబర్‌ 1, 2022వ తేదీ నాటికి తప్పనిసరిగా 20 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి. అంటే నవంబర్‌ 2, 1992 నుంచి నవంబర్‌ 1, 2002ల మధ్య జన్మించిన వారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. రిజర్వేషన్‌ వర్గాలకు వయోపరిమితి విషయంలో సడలింపు ఉంటుంది. ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్‌ విధానంలో నవంబర్‌ 21, 2022వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ ఈ రోజు నుంచి ప్రారంభమవుతుంది. దరఖాస్తు సమయంలో జనరల్‌/ఓబీసీ అభ్యర్ధులకు రూ.850లు, ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూబీడీ/ఈడబ్ల్యూఎస్/మహిళా అభ్యర్ధులు రూ.175లు దరఖాస్తు ఫీజు చెల్లించవల్సి ఉంటుంది. రాత పరీక్ష (ప్రిలిమినరీ, మెయిన్), ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. ఇతర సమాచారం అధికారిక నోటిఫికేషన్‌లో చెక్‌ చేసుకోవచ్చు.

ఖాళీల వివరాలు..

ఐటీ ఆఫీసర్‌ (స్కేల్‌-1) పోస్టులు: 44
అగ్రికల్చరల్‌ ఫీల్డ్‌ ఆఫీసర్‌ (స్కేల్‌-1) పోస్టులు: 516
రాజభాష అధికారి (స్కేల్‌-1) పోస్టులు: 25
లా ఆఫీసర్‌ (స్కేల్‌-1) పోస్టులు: 10
హెచ్‌ఆర్‌/పర్సనల్‌ ఆఫీసర్‌ (స్కేల్‌-1) పోస్టులు: 15
మార్కెటింగ్‌ ఆఫీసర్‌ (స్కేల్‌-1) పోస్టులు: 100

ముఖ్యమైన తేదీలు..

ఆన్‌లైన్‌లో దరఖాస్తులకు ప్రారంభ తేదీ: నవంబర్‌ 1, 2022.
ఆన్‌లైన్‌లో దరఖాస్తులక చివరి తేదీ: నవంబర్‌ 21, 2022.
ప్రిలిమినరీ పరీక్షకు హాల్‌ టికెట్ల డౌన్‌లోడింగ్‌ తేదీ: డిసెంబర్ 2022.
ఆన్‌లైన్ ప్రిలిమినరీ పరీక్ష తేదీ: డిసెంబర్ 24 నుంచి 31 వరకు 2022.
ప్రిలిమినరీ పరీక్ష ఫలితాల ప్రకటన: జనవరి 2023
ఆన్‌లైన్ మెయిన్ పరీక్ష తేదీ: జనవరి 29, 2023.
ఆన్‌లైన్ మెయిన్ పరీక్ష ఫలితాల ప్రకటన తేదీ: ఫిబ్రవరి 2023.
ఇంటర్వ్యూ తేదీ: ఫిబ్రవరి/మార్చి 2023.

రాత పరీక్ష వివరాలు..

ప్రిలిమినరీ రాత పరీక్ష మొత్తం 150 ప్రశ్నలకు 125 మార్కులకు 2 గంటల సమయంలో ఆన్‌లైన్‌ విధానంలో పరీక్ష నిర్వహిస్తారు.ఇంగ్లిష్‌ ల్యాంగ్వేజ్‌లో 50 ప్రశ్నలకు 25 మార్కులు, రీజనింగ్‌లో 50 ప్రశ్నలకు 50 మార్కులు, జనరల్ అవేర్‌నెస్‌లో 50 ప్రశ్నలకు 50 మార్కులకు పరీక్ష జరుగుతుంది. మెయిన్‌ పరీక్ష 60 ప్రశ్నలకు 60 మార్కులకు 45 నిముషాల్లో పరీక్ష జరుగుతుంది. మెయిన పరీక్షలో షార్ట్‌లిస్టింగ్‌ చేసిన వారిని ఇంటర్వ్యూకి పిలుస్తారు.


Posted in:

Related Posts

0 comments:

Post a Comment

Latest Job Notifications

Subscribe My Whatsapp & Telegram Groups More

Job Related Material

More

Bank Jobs

More
Top