BHEL Recruitment 2022: బెంగళూరులోని భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ (BHEL) - ఎలక్ట్రానిక్స్ డివిజన్... ప్రాజెక్ట్ ఇంజినీర్, ప్రాజెక్ట్ సూపర్వైజర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఈ నోటిఫికేషన్ ద్వారా 30 పోస్టులను భర్తీ చేయనుంది. సంబంధిత విభాగంలో డిప్లొమా/ బీఈ/ బీటెక్ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉన్న వాళ్లు అప్లయ్ చేసుకోవచ్చు. ఈ పోస్టులకు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. నవంబర్ 15 దరఖాస్తు చేసుకోవడానికి చివరితేది.
మొత్తం ఖాళీలు: 30
ప్రాజెక్ట్ ఇంజినీర్: 14 పోస్టులు ప్రాజెక్ట్ సూపర్వైజర్: 16 పోస్టులు
విభాగాలు: మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్.
అర్హత: సంబంధిత విభాగంలో డిప్లొమా/ బీఈ/ బీటెక్ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 01.11.2022 నాటికి 32 సంవత్సరాలు మించకూడదు.
వేతనం: నెలకు ప్రాజెక్ట్ ఇంజనీర్లకు రూ.78,000, ప్రాజెక్ట్ సూపర్వైజర్లకు రూ.43,550.
ఎంపిక ప్రక్రియ: విద్యార్హత పరీక్ష (డిగ్రీ/ డిప్లొమా)లో సాధించిన మార్కులు, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి.
ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తులు ప్రారంభం: అక్టోబర్ 25,
2022. దరఖాస్తుకు చివరితేది: నవంబర్ 15, 2022.
దరఖాస్తు హార్డ్ కాపీ పోస్టులో పంపేందుకు చివరి తేది: నవంబర్ 18, 2022.
పూర్తి వివరాలకు వెబ్సైట్: https://www.bhel.com/
0 comments:
Post a Comment