తాజాగా మరో జాబ్ మేళాకు సంబంధిచిన ప్రకటనను విడుదల చేసింది స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్. ఈ నెల 10న అంటే సోమవారం విశాఖపట్నంలో జాబ్ మేళాను నిర్వహించనున్నట్లు ప్రకటనలో పేర్కొన్నారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ముందుగా రిజిస్టర్ (Job Registration) చేసుకోవాల్సి ఉంటుంది. రిజిస్టర్ చేసుకున్న వారికి ఇంటర్వ్యూలను నిర్వహించి తుది ఎంపిక చేపడతారు. ఈ జాబ్ మేళా ద్వారా 9 ప్రముఖ కంపెనీల్లో ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు.
ఖాళీలు, విద్యార్హతల వివరాలు:
Ranstand India Pvt Ltd:ఈ సంస్థలో ఐటీ రిక్రూటర్ విభాగంలో 40 ఖాళీలు ఉన్నాయి. బీఎస్సీ, బీబీఏ, బీబీఎం, బీ.కామ్ (కంప్యూటర్స్), బీసీఏ, ఎంసీఏ చేసిన అభ్యర్థులు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు. ఎంపికైన వారికి నెలకు రూ.17 వేల వేతనం చెల్లించనున్నారు.
Concentrix:ఈసంస్థలో కంప్యూటర్ సర్వీస్&సేల్స్ విభాగంలో 100 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఎంపికైన వారు విశాఖపట్నంలో పని చేయాల్సి ఉంటుంది
Tekwissen Software Pvt Ltd:యూఎస్ ఐటీ రిక్రూటర్ విభాగంలో 30 ఖాళీలు ఉన్నాయి. ఇంటర్, డిగ్రీ, డిప్లొమా చేసిన వారు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు. ఎంపికైన వారికి నెలకు రూ.12 వేల వేతనం ఉంటుంది.
Beedata Technologies:ఈ సంస్థలో వివిధ విభాగాల్లో 70 ఖాళీలు ఉన్నాయి. డిగ్రీ లేదా ఎంబీఏ చేసిన వారు అర్హులు. ఎంపికైన వారు విశాఖలోని మధురవాడలో పని చేయాల్సి ఉంటుంది. ఎంపికైన వారికి ఏడాదికి రూ.1.2 లక్షల నుంచి రూ.1.5 లక్షల వరకు వేతనం చెల్లించనున్నారు.
Rover IT Technologies:ఈ సంస్థలో 25 ఖాళీలు ఉన్నాయి. ఏదైనా డిగ్రీ చేసిన వారు అప్లై చేసుకోవచ్చు. పురుషులు/స్త్రీలు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు.
-వీటితో పాటు మరో 5 సంస్థలో 90 ఖాళీలు ఉన్నాయి. ఇంటర్, డిగ్రీ, పీజీ చేసిన వారు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు.
ఇతర వివరాలు:
- అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ముందుగా ఈ లింక్ ద్వారా రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది.
- రిజిస్టర్ చేసుకున్న వారికి ఈ నెల 10న ప్రభుత్వ జూనియర్ కాలేజీ, ఎమ్మార్వో ఆఫీస్ ఎదురుగా, పెందుర్తి, విశాఖపట్నం చిరునామాలో ఇంటర్వ్యూలను నిర్వహించనున్నారు.
- అభ్యర్థులు ఇంటర్వ్యూలకు హాజరయ్యే సమయంలో Resume, డాక్యుమెంట్స్ వెంట తీసుకురావాల్సి ఉంటుంది.
- అభ్యర్థులు ఇతర పూర్తి వివరాలకు 9959377669, 9292553352 నంబర్లను సంప్రదించాలని ప్రకటనలో పేర్కొన్నారు.
0 comments:
Post a Comment