హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖకు చెందిన సశస్త్ర సీమ బల్ స్పోర్ట్స్ కోటాలో కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది.పదో తరగతి అర్హతతో కేంద్రప్రభుత్వ కొలువును సొంతం చేసుకునే అవకాశం వచ్చింది. ఖాళీలను ప్రస్తుతం తాత్కాలిక ప్రాతిపదికన భర్తీ చేసినప్పటికీ భవిష్యత్తులో పర్మినెంట్ చేసే అవకాశం ఉంటుంది. అర్హులైన స్త్రీ, పురుష అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
ప్రకటించినవాటిలో కానిస్టేబుల్ (జనరల్ డ్యూటీ), గ్రూప్-సి నాన్ గెజిటెడ్ పోస్టులు 399 ఉన్నాయి. అభ్యర్థులు పదో తరగతి/తత్సమాన పరీక్ష పాసై, నిర్దేశించిన క్రీడా ఈవెంట్లలో పాల్గొని ఉండాలి. వయసు 18-23 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎస్సీ/ఎస్టీ, ఓబీసీ అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా గరిష్ఠ వయసులో సడలింపులు వర్తిస్తాయి.
క్రీడా ఈవెంట్లు: ఆర్చరీ, అథ్లెటిక్స్, బాస్కెట్‌బాల్, బాడీబిల్డింగ్, బాక్సింగ్, సైక్లింగ్, ఈక్వెస్ట్రియన్, ఫెన్సింగ్, ఫుట్‌బాల్, హ్యాండ్‌బాల్, జిమ్నాస్టిక్స్, హాకీ, జూడో, కబడ్డీ, కరాటే, షూటింగ్, సెపక్ తక్రా, స్విమ్మింగ్, తైక్వాండో, వాలీబాల్, వెయిట్ లిఫ్టింగ్, ఉషు, వాటర్ స్పోర్ట్స్, యాచింగ్.
ఎంపిక: క్రీడా విజయాలు, రాత పరీక్ష, ఫీల్డ్ ట్రయల్, స్కిల్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, డిటైల్డ్ మెడికల్ ఎగ్జామినేషన్, రివ్యూ మెడికల్ ఎగ్జామినేషన్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ మొదలైన అంశాల ఆధారంగా ఎంపిక ఉంటుంది. ఎంపికైన అభ్యర్థులు దేశంలో ఎక్కడైనా లేదా దేశం వెలుపల సేవలు అందించాలి.
దరఖాస్తు
రుసుము: రూ.100 (ఎస్సీ, ఎస్టీ, మహిళా అభ్యర్థులు ఫీజు చెల్లించనవసరం లేదు). దరఖాస్తు రుసుమును ఐపీఓ (ఇండియన్ పోస్టల్ ఆర్డర్)/డీడీ (డిమాండ్ డ్రాఫ్ట్) ద్వారా చెల్లించాలి.
దరఖాస్తుకు జతపరచాల్సిన డాక్యుమెంట్లు
* విద్యార్థి పేరు, వయసును ధ్రువీకరించే పదో తరగతి సర్టిఫికెట్
*విద్యార్హతలను తెలియజేసే ఇతర సర్టిఫికెట్లు
*ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అభ్యర్థుల విషయంలో కుల ధ్రువీకరణ పత్రం
*ఎత్తు, ఛాతీ సడలింపు విషయంలో డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్/సబ్-డివిజినల్ మేజిస్ట్రేట్‌్/తాసిల్దార్ జారీచేసిన సర్టిఫికెట్
*డొమిసైల్/నేటివిటీ సర్టిఫికెట్
* పాల్గొన్న క్రీడలు, విభాగాలకు సంబంధించిన స్పోర్ట్స్ సర్టిఫికెట్లు
*రెండు పాస్‌పోర్ట్‌సైజ్ ఫొటోలు
*దరఖాస్తు రుసుము చెల్లింపు నిమిత్తం తీసిన రూ.100 ఐపీఓ/డీడీ.
ఫీల్డ్ ట్రయల్/స్కిల్ టెస్ట్: డాక్యుమెంట్ వెరిఫికేషన్‌లో అర్హత సాధించిన అభ్యర్థులను ఈ టెస్ట్‌కు ఎంపికచేస్తారు. అంతర్జాతీయ పోటీల్లో పాల్గొన్న అభ్యర్థులు, జాతీయ స్థాయి పతకాలు గెలుచుకున్నవారికి స్కిల్ టెస్ట్ నుంచి మినహాయింపు ఉంటుంది. ఇంకా ఖాళీలు మిగిలినట్లయితే ఆల్ ఇండియా యూనివర్సటీ, నేషనల్ స్కూల్ గేమ్స్‌లో గెలిచినవారికి ఫీల్డ్ టెస్ట్/ స్కిల్ టెస్ట్‌ను నిర్వహిస్తారు.
క్రీడా విజయాలు: అంతర్జాతీయ స్థాయి క్రీడల్లో పాల్గొన్న వారికి మొదటి ప్రాధాన్యం ఉంటుంది. అంతర్జాతీయక్రీడల్లో సీనియర్ స్థాయిలో.. బంగారు పతకం సాధిస్తే 50 మార్కులు, రజత పతకానికి 47, కాంస్య పతకానికి 44, పాల్గొన్నవారికి 41 మార్కులు కేటాయిస్తారు. జూనియర్ స్థాయిలో.. బంగారు పతకం సాధిస్తే 48 మార్కులు, రజత పతకానికి 45, కాంస్య పతకానికి 42, పాల్గొంటే 39 మార్కులు కేటాయిస్తారు.
*జాతీయ క్రీడల్లో సీనియర్ స్థాయిలో.. బంగారు పతకం సాధిస్తే 45 మార్కులు, రజతానికి 42, కాంస్యానికి 39 మార్కులు ఇస్తారు. జూనియర్ స్థాయిలో... బంగారు పతకానికి 37, రజతానికి 34, కాంస్యానికి 31 మార్కులు ఉంటాయి.
*ఇంటర్ యూనివర్సిటీ పోటోల్లో పాల్గొని బంగారు పతకం సాధిస్తే 20 మార్కులు, రజతానికి 19, కాంస్యానికి 18 మార్కులు ఇస్తారు.
*ఆల్ ఇండియా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ పోటీల్లో పాల్గొని బంగారు పతకం సాధిస్తే 15 మార్కులు, రజతానికి 14 మార్కులు, కాంస్యానికి 13 మార్కులు ఉంటాయి.
ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ (పీఎస్‌టీ): ఫీల్డ్ ట్రయల్‌లో అర్హత సాధించిన వారికి పీఎస్‌టీ నిర్వహిస్తారు. పురుష అభ్యర్థులు 170 సెం.మీ. ఎత్తు, మహిళలు 157 సెం.మీ. ఎత్తు ఉండాలి. ఛాతీ 80 సెం.మీ., గాలి పీల్చినప్పుడు 85 సెం.మీ.ఉండాలి. పర్వత ప్రాంతాలకు చెందిన అభ్యర్థులకు ఎత్తు, ఛాతీ విషయంలో మినహాయింపులు వర్తిస్తాయి.
గుర్తుంచుకోవాల్సినవి
*కవరు మీద దరఖాస్తు చేసే పోస్టు పేరును స్పష్టంగా రాయాలి.
*గవర్నమెంట్/సెమీ గవర్నమెంటు సంస్థలో పనిచేస్తున్న అభ్యర్థులు ప్రస్తుత యజమాని నుంచి పొందిన 'నో అబ్జెక్షన్ సర్టిఫికెట్‌ను' సమర్పించాలి.
*రిక్రూట్‌మెంట్ టెస్టులకు హాజరుకావడానికి అభ్యర్థులకు ఎలాంటి టీఏ/డీఏలను చెల్లించరు. సొంత ఖర్చులతోనే ప్రయాణ, వసతి ఏర్పాట్లు చేసుకోవాలి.
దరఖాస్తుకు చివరి తేదీ: ఎంప్లాయిమెంట్ న్యూస్‌లో ఈ ప్రకటన వెలువడిన తేదీ నుంచి 30 రోజుల్లోపు.
వెబ్‌సైట్: www.ssbrectt.gov.in
దరఖాస్తులు పంపాల్సిన చిరునామా: ది ఇన్‌స్పెక్టర్ జనరల్, ఫ్రంటియర్ హెడ్ క్వాటర్, ఎస్‌ఎస్‌బీ పట్నా, 3వ ఫ్లోర్, కార్పురీ ఠాకుర్ సదన్, అషియానా-ఢోగ్లా రోడ్, పట్నా - 800 025, బిహార్.
0 comments:
Post a Comment