హాల్‌టికెట్లను అభ్యర్థులు www.tspsc.gov.in వెబ్‌సైట్ ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవాలని టీఎస్‌పీఎస్సీ కార్యదర్శి అనితా రామచంద్రన్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 16న ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు గ్రూప్-1 ప్రిలిమ్స్ (ఆబ్జెక్టివ్ టైప్)ను అన్ని జిల్లా కేంద్రాల్లో నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. ఈనెల 16 వరకు హాల్‌టికెట్లు వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటాయని తెలిపారు. ఏప్రిల్ 26వ తేదీన 503 పోస్టుల భర్తీకి తెలంగాణ తొలి గ్రూప్-1 నోటిఫికేషన్‌ను విడుదల చేశామని గుర్తు చేశారు.
వీలైనంత త్వరగా హాల్‌టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవాలని అభ్యర్థులకు సూచించారు. 3,80,202 మంది అభ్యర్థులు దరఖాస్తు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 1,040 పరీక్షా కేంద్రాలను ఏర్పాట్లు చేసినట్టు తెలిసింది. జనవరి లేదా ఫిబ్రవరిలో గ్రూప్-1 మెయిన్స్ రాతపరీక్షలను టీఎస్‌పీఎస్సీ నిర్వహించనుంది.
0 comments:
Post a Comment