టెక్ కంపెనీల నియామకాలు ప్రస్తుతం కాస్త నెమ్మదించినప్పటికీ, రిక్రూట్‌మెంట్స్ మాత్రం వివిధ సంస్థల అవసరాలకు అనుగుణంగా కొనసాగుతూనే ఉన్నాయి. టాప్ కంపెనీలు ఇప్పటికే త్రైమాసికాల వారీగా నియామకాల లక్ష్యాలకు చేరువ అవుతున్నాయి.
ఈ నేపథ్యంలో ఫ్రెంచ్ బేస్డ్ ఐటీ దిగ్గజం క్యాప్‌జెమినీ (Capgemini) లేటెస్ట్ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ ప్రారంభించింది. ఈ సంస్థ ఇండియా(India)లో వివిధ ఉద్యోగాల కోసం నియామక ప్రక్రియను ప్రారంభించింది. ఎంపికైన వారు రిమోట్ వర్కింగ్ ఫెసిలిటీతో వర్క్ ఫ్రమ్ హోమ్(Work from home)ఆప్షన్‌ను ఉపయోగించుకోవచ్చు.
అర్హులకు ఉద్యోగ అవకాశం ..
అనుభవం, అర్హత ఆధారంగా అభ్యర్థులను వివిధ జాబ్ రోల్స్‌లో నియమించుకుంటామని క్యాప్‌జెమిని ప్రకటించింది. ఒక సంవత్సరం నుంచి 15 సంవత్సరాల వరకు అనుభవం ఉన్నవారితో పాటు ఎంట్రీ లెవల్ గ్రాడ్యుయేట్స్‌ను నియమించుకోనుంది. ఫ్రెషర్స్‌ను కోల్‌కతా ఆఫీస్‌లోని కాంట్రాక్ట్ మేనేజ్‌మెంట్ అసోసియేట్ పొజిషన్ కోసం కంపెనీ రిక్రూట్ చేసుకోనుంది. అవసరాన్ని బట్టి వివిధ పోస్టులకు నియామక ప్రక్రియ మారే అవకాశం ఉంది.
ఈ విభాగాల్లో ఖాళీలు
క్యాప్‌జెమిని ప్రస్తుతం అప్లికేషన్స్ & టెక్నాలజీ, ఫైనాన్షియల్ సర్వీసెస్, స్ట్రాటజీ & ట్రాన్స్‌ఫర్మేషన్, కన్సల్టింగ్, మాన్యుఫ్యాక్చరింగ్, మీడియా & ఎంటర్‌టైన్‌మెంట్, ఎనర్జీ & యుటిలిటీస్ ఆపరేషన్స్ & ఇంజినీరింగ్, కన్స్యూమర్ గూడ్స్ & రిటైల్, టెలికమ్యూనికేషన్ విభాగాల్లో ఫ్రెషర్స్‌ను నియమించుకోనుంది. ముంబై, బెంగళూరు, నోయిడా, కోల్‌కతా, చెన్నై, హైదరాబాద్ , పూణేలోని క్యాప్‌జెమినీ ఆఫీసుల్లో వివిధ జాబ్ రోల్స్ అందుబాటులో ఉన్నాయి. ఈ ఉద్యోగాల గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి లేదా అప్లై చేసుకోవడానికి అభ్యర్థులు కంపెనీ అధికారిక వెబ్‌సైట్ www.capgemini.com చూడవచ్చు. లేదా కంపెనీ లింక్డ్‌ఇన్ పేజీలో వివరాలు చెక్ చేయవచ్చు.
గ్లోబల్ కంపెనీ..
క్యాప్‌జెమినీ ప్రపంచవ్యాప్తంగా 50 కంటే ఎక్కువ దేశాల్లో ఆపరేట్ అవుతోంది. ఈ కంపెనీలో ప్రస్తుతం 3.4 లక్షల కంటే ఎక్కువ మంది ఉద్యోగులు ఉన్నారు. ఫోర్బ్స్ గ్లోబల్ 2000 జాబితాలోని 200 అతిపెద్ద పబ్లిక్ కంపెనీలలో 85 శాతం తమ క్లయింట్లు అని కంపెనీ పేర్కొంది. ఇంతటి ప్రాధాన్యం ఉన్న సంస్థలో ఉద్యోగ అవకాశాలను ఫ్రెషర్స్, ఎక్స్‌పీరియన్స్ ఉన్నవారు అందిపుచ్చుకోవాలని సూచించింది.
వెబ్‌సైట్లో అప్లై చేసుకోవచ్చు..
క్యాప్‌జెమినీలో వివిధ ఉద్యోగ అవకాశాలు, జాబ్ రోల్స్ ఉన్నట్లు వెబ్‌సైట్ పేర్కొంది. అర్హత, అనుభవం ఆధారంగా వీటికి అప్లై చేసుకోవచ్చని వెల్లడించింది. "మరింత స్థిరమైన, సమగ్రమైన భవిష్యత్తును నిర్మించేలా మా క్లయింట్స్‌కు సహాయం చేస్తున్నాం. మీరు క్యాప్‌జెమినీలో చేరితే.. అభివృద్ధి చెందుతున్న కంపెనీలోని వ్యవస్థాపకులు, ఇండస్ట్రీ నిపుణులతో కూడిన గ్లోబల్ ప్లాట్‌ఫామ్‌లో భాగమవుతారు. వీరంతా టెక్నాలజీని మరింత ముందుకు తీసుకెళ్తారు" అని కంపెనీ వెబ్‌పేజీలో పేర్కొంది.
0 comments:
Post a Comment