ప్రభుత్వ బ్యాంకులో ఉద్యోగాలు చేయాలని ఎదురుచూస్తున్న వారికి గుడ్ న్యూస్. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పలు విభాగాల్లో స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ విడుదలయ్యింది. ఎకనామిస్ట్, ఐటీ, డేటా సైంటిస్ట్ వంటి పలు విభాగాల్లో భర్తీలు కోరుతూ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. డిగ్రీ, బీటెక్, పీజీ, పీజీ డిప్లోమా, బీ.ఎస్సి, ఎంబీఏ, ఎంసీఏ, ఎం.ఎస్.సి, సీఏ చేసిన అభ్యర్థులను ఆహ్వానిస్తోంది. అర్హతను బట్టి 36 వేల నుంచి లక్ష పైగా జీతం వస్తుంది. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. అక్టోబర్ 17 లోపు దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు చేసే ముందు ఖాళీలు, వాటి వివరాలు, అర్హత ప్రమాణాలు ఏమిటో తెలుసుకోండి.
ఖాళీలు: 110
కేటగిరీల వారీగా ఖాళీలు:
ఎస్సీ: 19
ఎస్టీ: 06
ఓబీసీ: 22
ఈడబ్ల్యూఎస్: 07
జనరల్: 56
స్కేల్ వారీగా పోస్టుల వివరాలు:
ఐటీ: 01 (స్కేల్ 5)
ఎకనామిస్ట్: 01 (స్కేల్ 5)
డేటా సైంటిస్ట్: 01 (స్కేల్ 4)
రిస్క్ మేనేజర్: 03 (స్కేల్ 3)
ఐటీ ఎస్ఓసీ అనలిస్ట్: 01 (స్కేల్ 3)
ఐటీ సెక్యూరిటీ అనలిస్ట్: 01 (స్కేల్ 3)
టెక్నికల్ ఆఫీసర్(క్రెడిట్): 15 (స్కేల్ 3)
క్రెడిట్ ఆఫీసర్: 06 (స్కేల్ 3)
డేటా ఇంజనీర్: 09 (స్కేల్ 3)
ఐటీ: 11 (స్కేల్ 3)
రిస్క్ మేనేజర్: 18 (స్కేల్ 2)
లా ఆఫీసర్: 05 (స్కేల్ 2)
ఐటీ: 21 (స్కేల్ 2)
సెక్యూరిటీ: 02 (స్కేల్ 2)
ఫైనాన్సియల్ అనలిస్ట్: 08 (స్కేల్ 2)
క్రెడిట్ ఆఫీసర్స్ 02 (స్కేల్ 2)
ఎకనామిస్ట్: 02 (స్కేల్ 2)
సెక్యూరిటీ: 03 (స్కేల్ 1)
పోస్టుల వారీగా అర్హతలు:
ఐటీ: డిగ్రీ (ఇంజనీర్)
ఎకనామిస్ట్: పోస్ట్ గ్రాడ్యుయేట్ (ఎకనామిక్స్/బ్యాంకింగ్/కామర్స్/ఎకనామిక్ పాలసీ/పబ్లిక్ పాలసీ)
డేటా సైంటిస్ట్: బీ.ఈ./బీ.టెక్ లేదా సంబంధిత విభాగంలో పోస్ట్ గ్రాడ్యుయేట్
రిస్క్ మేనేజర్: బీ.ఎస్సీ లేదా ఎంబీఏ లేదా డిప్లోమా( ఎఫ్ఆర్ఎమ్/సిఎఫ్ఏ)
ఐటీ ఎస్ఓసి అనలిస్ట్: డిగ్రీ (ఇంజనీరింగ్)
ఐటీ సెక్యూరిటీ అనలిస్ట్: డిగ్రీ(ఇంజనీరింగ్) లేదా ఎంసిఏ లేదా ఎం ఎస్ సి ఐటీ, ఎం ఎస్ సి కంప్యూటర్ సైన్స్
టెక్నికల్ ఆఫీసర్(క్రెడిట్): డిగ్రీ (సివిల్/మెకానికల్/ప్రొడక్షన్/మెటలర్జీ/టెక్స్టైల్/కెమికల్)
క్రెడిట్ ఆఫీసర్: సీఏ లేదా సీఎఫ్ఏ లేదా ఏసీఎంఏ లేదా ఎంబీఏ
డేటా ఇంజనీర్: పీజీ లేదా సంబంధిత విభాగంలో పీజీ డిప్లోమా
లా ఆఫీసర్: డిగ్రీ(ఎల్ ఎల్ బి)
సెక్యూరిటీ: డిగ్రీ
ఫైనాన్సియల్ అనలిస్ట్: సీఏ లేదా ఐసీడబ్ల్యూఏ
01.07.2022 నాటికి వయసు పరిమితి:
ఐటీ: 35 నుంచి 50 ఏళ్లు
ఎకనామిస్ట్: 30 నుంచి 45 ఏళ్లు
డేటా సైంటిస్ట్: 28 నుంచి 35 ఏళ్లు
రిస్క్ మేనేజర్: 20 నుంచి 35 ఏళ్లు
ఐటీ ఎస్ఓసి అనలిస్ట్: 26 నుంచి 40 ఏళ్లు
ఐటీ సెక్యూరిటీ అనలిస్ట్: 26 నుంచి 35 ఏళ్లు
టెక్నికల్ ఆఫీసర్(క్రెడిట్): 26 నుంచి 34 ఏళ్లు
క్రెడిట్ ఆఫీసర్: 26 నుంచి 34 ఏళ్లు
డేటా ఇంజనీర్: 26 నుంచి 35 ఏళ్లు
లా ఆఫీసర్: 20 నుంచి 35 ఏళ్లు
సెక్యూరిటీ: 20 నుంచి 35 ఏళ్లు
ఫైనాన్సియల్ అనలిస్ట్: 26 నుంచి 35 ఏళ్లు
జీతభత్యాలు:
జేఎంజీ స్కేల్ 1: రూ. 36 వేల నుంచి రూ. 63,840 వరకూ
ఎంఎంజీ స్కేల్ 2: రూ. 48,170 నుంచి రూ. 69,810 వరకూ
ఎంఎంజీ స్కేల్ 3: రూ. 63,840 నుంచి రూ. 78,230 వరకూ
ఎస్ఎంజీ స్కేల్ 4: రూ. 76,010 నుంచి రూ. 89,890 వరకూ
టిఎంజీ స్కేల్ 5: రూ. 89,890 నుంచి రూ. 1,00,350 వరకూ
దరఖాస్తు ఫీజు:
ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూడీ: రూ. 175 + జీఎస్టీ
మిగతా వారికి: రూ. 850 + జీఎస్టీ
ఆన్ లైన్ రిజిస్ట్రేషన్ కి ఆఖరు తేదీ: అక్టోబర్ 17 2022
దరఖాస్తు ప్రింట్ చేసుకోవడానికి ఆఖరు తేదీ: నవంబర్ 01 2022
ఇంటర్వ్యూ కాల్ లెటర్ డౌన్ లోడ్ తేదీ: నవంబర్ 2022
ఇంటర్వ్యూ తేదీ: డిసెంబర్ 2022
వివిధ రకాల ఉద్యోగ నోటిఫికేషన్ కోసం క్రింది వాట్సాప్ గ్రూప్ లో చేరండి:
0 comments:
Post a Comment