డిపార్ట్‌మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీకి చెందిన అటామిక్ మినరల్స్ డైరెక్టరేట్ ఫర్ ఎక్స్‌ప్లోరేషన్ అండ్ రిసెర్చ్ దేశవ్యాప్తంగా ఉన్న డీఏఈ కేంద్రాల్లో ఖాళీగా ఉన్న వివిధ పోస్టుల నియామకానికి దరఖాస్తులు కోరుతుంది. దీని ద్వారా జేటీఓ, ఏఎస్ఓ, సెక్యూరిటీ గార్డు పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టుల వారీగా విద్యార్హతలు నిర్ణయించారు. పదవతరగతి, డిగ్రీ, పీజీ ఉత్తీర్ణత గల అభ్యర్ధులు అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు నవంబర్ 17 లోపు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తుచేసుకోవాల్సి ఉంటుంది.
మొత్తం పోస్టులు: 321
1) జూనియర్ ట్రాన్స్‌లేషన్ ఆఫీసర్(జేటీఓ): 09
అర్హత: సంబంధిత విభాగంలో మాస్టర్స్ డిగ్రీ ఉండాలి.
వయోపరిమితి: 18-28 ఏళ్ల మధ్య ఉండాలి.
జీతం: రూ.35,400.
2) అసిస్టెంట్ సెక్యూరిటీ ఆఫీసర్(ఏఎస్ఓ): 38
అర్హత: డిగ్రీ లేదా తత్సమాన విద్యార్హత ఉండాలి.
వయోపరిమితి: 18-27 ఏళ్ల మధ్య ఉండాలి.
జీతం: రూ.35,400.
3) సెక్యూరిటీ గార్డు: 274
అర్హత: పదవతరగతి ఉత్తీర్ణత లేదా తత్సమాన విద్యార్హత ఉండాలి.
వయోపరిమితి: 18-27 ఏళ్ల మధ్య ఉండాలి.
జీతం: రూ.18,000.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయాలి.
ఎంపిక ప్రక్రియ: పోస్టులను అనుసరించి లెవల్ -1 (రాత పరీక్ష), లెవల్ -2 (డిస్క్రిప్టివ్ రాతపరీక్ష), ఫిజికల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో పరీక్షా కేంద్రాలు: హైదరాబాద్, విశాఖపట్నం.
ముఖ్యమైన తేదీలు..
* ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 29.10.2022.
* ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 17.11.2022.
* ఏఎస్ఓ -ఎ, సెక్యూరిటీ గార్డు పోస్టులకు ఫిజికల్ టెస్ట్ తేదీలు: డిసెంబర్, 2022.
* జేటీఓ (లెవల్ -1), సెక్యూరిటీ గార్డు పోస్టుల రాత పరీక్ష (కంప్యూటర్ ఆధారిత పరీక్ష): జనవరి, 2023
* జేటీఓ (లెవల్ - 2), ఏఎస్ఓ -ఎ డిస్క్రిప్టివ్ టెస్ట్ తేదీ: ఫిబ్రవరి, 2023.
0 comments:
Post a Comment