Wipro WILP 2022 Recruitment Drive - Wipro
Careers: దేశంలో అతి పెద్ద టెక్ దిగ్గజం అయిన విప్రో (Wipro) డిగ్రీ పూర్తి చేసుకున్న విద్యార్థులకు గొప్ప సదవకాశాన్ని కల్పిస్తోంది. విప్రో వర్క్ ఇంటిగ్రేటెడ్ లెర్నింగ్ ప్రోగ్రామ్ (WILP) 2022 ద్వారా కొత్త ఉద్యోగులను నియమించుకోనుంది. అయితే 2021, 2022లో డిగ్రీ పూర్తి చేసిన వారు మాత్రమే అర్హులు.
BCA, BSc వంటి గ్రూపుల్లో డిగ్రీ పూర్తిచేసిన వారు వీటికి దరఖాస్తు చేసుకోవచ్చని సంబంధిత వర్గాలు పేర్కొంటున్నాయి. 10వ తరగతి పూర్తయిన తర్వాత గ్రాడ్యుయేషన్ మధ్యలో గరిష్ఠంగా 3 సంవత్సరాలు మాత్రమే గ్యాప్ అనుమతించబడుతుంది. గ్రాడ్యుయేషన్ చదువుతున్నప్పుడు గ్యాప్ వస్తే దానిని పరిగణలోకి తీసుకోమని స్పష్టంగా తెలిపింది.
Wipro వర్క్ ఇంటిగ్రేటెడ్ లెర్నింగ్ ప్రోగ్రామ్ (WILP) ప్రోగ్రామ్ 2022 ఏమిటంటే..?
డిగ్రీ పూర్తి చేయగానే చాలామందికి ఉన్నత చదువు చదవాలనే కోరిక ఉంటుంది. కానీ ఆర్థిక పరిస్థితులు అనుకూలించవు. ఉద్యోగం చేసుకుంటూ వచ్చిన సంపాదనతో పాటు మరోపక్క చదువును కూడా కొనసాగించాలనుకునే వారికి ఇది సరైన ఎంపిక. వీరు విప్రోలో ఉద్యోగం చేసుకుంటూనే దేశంలోని ప్రముఖ విద్యాసంస్థ నుంచి M.Techలో ఉన్నత విద్యను పూర్తి చేసే అవకాశాన్ని విప్రో కల్పిస్తోంది.
Wipro WILP 2022 - ముఖ్య సమాచారం:
అర్హత: 60 శాతం మార్కులతో BCA, BSc డిగ్రీ పూర్తి చేసి ఉంటే సరిపోతుంది.
జీతం: నెలకు రూ.15,488 చెల్లిస్తారు.
మొదటి సంవత్సరం స్టైఫండ్ కింద 15,000 + 488 (ESI) + జాయినింగ్ బోనస్ రూ.75 వేలు ఇస్తారు.
రెండో సంవత్సరం స్టైఫండ్ - 17,000 + 553 (ESI).
మూడో సంవత్సరం స్టిఫెండ్ - 19,000 + 618 (ESI)
నాల్గవ సంవత్సరం నెలకు రూ. 23,000 చెల్లిస్తారు.
ఈ నాలుగు సంవత్సరాలు పూర్తి అయిన తర్వాత సీనియర్ ప్రాజెక్ట్ ఇంజనీర్ హోదా కల్పిస్తారు. సదరు ఉద్యోగి పనితీరును బట్టి జీతం ఏడాదికి రూ.6,00,000 నుంచి ఉంటుంది.
అలాగే.. గడచిన 3 నెలల కాలంలో విప్రో నిర్వహించిన ఏదైనా జాబ్ ఇంటర్వ్యూ ప్రక్రియలో పాల్గొన్న వారు ఈ ప్రోగ్రామ్ కు అనర్హులని కంపెనీ తెలిపింది. మూడు నెలల సమయం గడిచిన వారు ఈ ప్రోగ్రామ్ కు అర్హులుగా పేర్కొన్నారు. దరఖాస్తు.. అర్హత ప్రమాణాలు.. పైన తెలిపిన విద్యార్హతలు కలిగిన వ్యక్తి ఎవరైన ఈ ప్రోగ్రామ్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చేసుకోవడానికి అక్టోబర్ 10 ఆఖరు తేది. పూర్తి వివరాలు సంస్థ వెబ్సైట్లో చూడొచ్చు.
0 comments:
Post a Comment