Accenture ASE Recruitment 2022: ఇంజనీరింగ్ స్టూడెంట్స్కు జాబ్ ఆఫర్స్ అందిస్తోంది టెక్నాలజీ సర్వీసెస్, అవుట్ సోర్సింగ్, మల్టీనేషనల్ మేనేజ్మెంట్ కన్సల్టింగ్ సంస్థ యాక్సెంచర్. ఈ కంపెనీ అసోసియేట్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ (ASE) రోల్ కోసం రిక్రూట్మెంట్ చేపట్టింది. BE, B.Techలో CSE, IT, ECE కోర్సులు పూర్తి చేసిన ఫ్రెషర్లు; 2020, 2021 లేదా 2022 బ్యాచ్ల MCA గ్రాడ్యుయేట్స్ ఈ ఉద్యోగానికి అప్లయ్ చేసుకోవచ్చు.
జీతం: ఎంపికైన అభ్యర్థులకు జీతం రూ.4,50,000 వరకు ఉంటుంది.
జాబ్ లొకేషన్: Bangalore, Hyderabad, Pune, Mumbai, Chennai, Gurgaon, Kolkata
ఎంపిక విధానం:
మాక్ అసెస్మెంట్: 20 నిమిషాల మాక్/ ప్రాక్టీస్ అసెస్మెంట్ ఉంటుంది. ఇందులో అభ్యర్థులకు సరైన హార్డ్వేర్, సాఫ్ట్వేర్, ఇంటర్నెట్ ఉందని నిర్ధారణకు వస్తారు.
కాగ్నిటివ్, టెక్నికల్ అసెస్మెంట్: ఇందులో 90 నిమిషాల సమయంలో 50 ప్రశ్నలకు సమాధానాలు రాయాలి. అభ్యర్థుల ఇంగ్లీష్ సామర్థ్యం, విమర్శనాత్మక ఆలోచన, సమస్య పరిష్కార నైపుణ్యాలు పరిశీలిస్తారు. పరీక్షలో భాగంగా అబ్స్ట్రాక్ట్ రీజనింగ్, సూడోకోడ్, నెట్వర్కింగ్, సెక్యూరిటీ, క్లౌడ్ తదితర అంశాలకు సంబంధించిన ప్రశ్నలు ఉంటాయి.కోడింగ్ అసెస్మెంట్ కమ్యూనికేషన్ అసెస్మెంట్.
దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఈ క్రింది లింక్ ద్వారా అభ్యర్థుల దరఖాస్తులు చేసుకోండి
0 comments:
Post a Comment