(APSSDC) రాష్ట్రంలోని నిరుద్యోగులకు మరో శుభవార్త చెప్పింది. ఈ నెల 20న మంగళవారం ఉదయం 10 గంటలకు శ్రీకాకుళంలో జాబ్ మేళాను (Job Mela) నిర్వహించనున్నట్లు ప్రకటించింది. అయితే ఈ జాబ్ మేళాను కేవలం దివ్యాంగుల కోసం మాత్రమే ప్రత్యేకంగా నిర్వహిస్తున్నారు. ఈ జాబ్ మేళా ద్వారా Max, Amazon, Reliance Trends, Tukso సంస్థల్లో ఖాళీలను (Jobs) భర్తీ చేయనున్నారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది.
ఖాళీలు, విద్యార్హతల వివరాలు:
Max Fashion: ఈ సంస్థలో మొత్తం 15 ఖాళీలు ఉన్నాయి. అసోసియేట్ విభాగంలో ఈ ఖాళీలు ఉన్నాయి. టెన్త్, ఇంటర్, డిగ్రీ విద్యార్హత కలిగిన వారు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు. వయస్సు 18-26 ఏళ్లు ఉండాలి. ఎంపికైన వారికి నెలకు రూ.12,500 వరకు వేతనం చెల్లించనున్నారు. ఎంపికైన వారు శ్రీకాకుళం , వైజాగ్, రాజమండ్రిలో పని చేయాల్సి ఉంటుంది.
Amazon: ఈ సంస్థలో 10 ఖాళీలు ఉన్నాయి. టెన్త్, ఇంటర్ విద్యార్హత కలిగిన వారు అప్లై చేసుకోవచ్చు. ఎంపికైన వారికి నెలకు రూ.14 వేల వేతనం ఉంటుంది. ఎంపికైన వారు వైజాగ్, విజయవాడ , గుంటూరు , హైదరాబాద్ లో పని చేయాల్సి ఉంటుంది.
0 comments:
Post a Comment