UPSC Engineering Services Examination 2023: న్యూదిల్లీలోని యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇంజినీరింగ్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ (UPSC ESE 2023) నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఈ ప్రకటన ద్వారా యూపీఎస్సీ దేశవ్యాప్తంగా రైల్వే, టెలికాం, డిఫెన్స్ సర్వీస్ తదితర కేంద్ర ప్రభుత్వ విభాగాలు, శాఖల్లో ఇంజినీరింగ్ ఉద్యోగాలు భర్తీ చేయనుంది. ఈ నోటిఫికేషన్ ద్వారా సివిల్ ఇంజినీరింగ్, మెకానికల్ ఇంజినీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలీకమ్యూనికేషన్ ఇంజినీరింగ్ విభాగాల్లో మొత్తం 327 పోస్టులు భర్తీ కానున్నాయి. దరఖాస్తు ప్రక్రియ సెప్టెంబర్ 14న ప్రారంభమైంది. అక్టోబర్ 4 దరఖాస్తులకు చివరితేది.
UPSC Engineering Services Examination
2023
మొత్తం ఖాళీలు: 327
విభాగాలు: సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలీకమ్యూనికేషన్ ఇంజనీరింగ్ తదితర విభాగాల్లో ఈ ఖాళీలున్నాయి. విద్యార్హతలు: పోస్టును అనుసరించి గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిప్లొమా, బీఈ/ బీటెక్ చదివి ఉండాలి. లేదా ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఇంజినీర్స్(ఇండియా) ఇన్స్టిట్యూట్ ఎగ్జామినేషన్స్ ఎ. బి విభాగాలు ఆఫ్ ఇంజినీర్స్(ఇండియా) ఇన్స్టిట్యూట్ ఎగ్జామినేషన్స్ ఎ, బి విభాగాలు ఉత్తీర్ణులై ఉండాలి. లేదా ఏరోనాటికల్ సొసైటీ ఆఫ్ ఇండియా అసోసియేట్ మెంబర్షిప్ ఎగ్జామినేషన్ పార్ట్స్ 2, 3/ సెక్షన్లు ఎ, బి అర్హత సాధించాలి. లేదా ఎలక్ట్రానిక్స్ & టెలికమ్యూనికేషన్ ఇంజినీర్స్ ఇన్స్టిట్యూషన్(ఇండియా) గ్రాడ్యుయేట్ సభ్యత్వ పరీక్ష పాసై ఉండాలి. లేదా ఎంఎస్సీ(వైర్లెస్ కమ్యూనికేషన్ ఎలక్ట్రానిక్స్, రేడియో ఫిజిక్స్,
రేడియో ఇంజినీరింగ్) ఉత్తీర్ణులై ఉండాలి.
వయసు: అభ్యర్థులు వయసు 01-01-2023 నా 21-30 ఏళ్ల మధ్య ఉండాలి.
దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి. అభ్యర్థులు ముందుగా పార్ట్-1, పార్ట్-2 అప్లికేషన్ పూర్తి చేయాలి.
• ఎంపిక విధానం: స్టేజ్-1 (ప్రిలిమినరీ/ స్టేజ్-1) ఎగ్జామ్, స్టేజ్-2(మెయిన్/ స్టేజ్-2) ఎగ్జామ్, స్టేజ్-3(పర్సనాలిటీ టెస్ట్), మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
దరఖాస్తు ఫీజు: మహిళా / ఎస్సీ / ఎస్టీ / పీడబ్ల్యూడీ అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు. ఇతరులు రూ.200 చెల్లించాలి.
ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోని ప్రిలిమినరీ పరీక్షా కేంద్రాలు: హైదరాబాద్, విశాఖపట్నం, తిరుపతి.ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోని మెయిన్ పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, విశాఖపట్నం.
ముఖ్యమైన తేదీలు:
ఆన్లైన్ దరఖాస్తులు ప్రారంభం: 14-09-2022
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 04-10-2022
నగదు ద్వారా ఫీజు చెల్లింపు చివరి తేదీ: 03-10-2022
ఆన్లైన్లో ఫీజు చెల్లింపు చివరి తేదీ: 04-10-2022
ప్రిలిమినరీ/ స్టేజ్-1 పరీక్ష తేది: 19-02-2023
పూర్తి వివరాలకు వెబ్సైట్:
Subscribe My Whatsapp & Telegram Groups
0 comments:
Post a Comment