Good News: ఇంటర్ పూర్తి చేసిన విద్యార్థులకు గుడ్ న్యూస్.. జాబ్లో పాటు ఉన్నతచదువులకు ఛాన్స్.. వివరాలివే..!
ఇంటర్ పూర్తిచేసిన విద్యార్థులకు శుభవార్త.. మీకు ఇంటర్ అర్హతలో మల్టీనేషనల్ కంపెనీలో పనిచేసే అవకాశం..అంతేకాదు బిట్స్ పిలానీలో చదువుకునే సదవకాశం..!మీరు చేయాల్సిందల్లా జాబ్‌మేళాలో పాల్గొని మీ సత్తాను నిరూపించుకోవడమే..! ఏపీ.ఎస్.ఎస్.డి.సి ఆధ్వర్యంలో ఈనెల 18వ తేదీన కర్నూలు నగరంలోని జి.పుల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్‌లో మెగా జాబ్ మేళా జరగనుంది. ఇంటర్ ఉత్తీర్ణులైన విద్యార్థులకు ఉన్నత చదువులు(Higher education) చదివే అవకాశం ఈ జాబ్ మేళాలో కల్పించనున్నారు. ఇంటర్మీడియట్ విద్యా మండలి ఆధ్వర్యంలో నిర్వహించే ఈ జాబ్ మేళా ఉదయం 8 గంటలకు ప్రారంభమవుతుందని డి.వి.ఈఓ జమీర్ షాషా మరియు ఆర్.ఐ.వో శ్రీ గురువయ్య శెట్టి ఒక ప్రకటనలో తెలిపారు. ఇంటర్మీడియట్ విద్యా మండలి, ఏపీ సమాచార, సాంకేతిక అకాడమీ, ఏపీ నైపుణ్యాభివృద్ధి, సంస్థల సహకారంతో ఇంటర్ విద్యార్థులకు హెచ్. సి.ఎల్ (HCL)లో ఉద్యోగాలతో పాటు, బిట్స్ పిలానీలో (BITS-PILANI)లో చదివే అవకాశం ఉందని డివిఈఓ జమీర్ షాషా తెలిపారు. 2021- 2022 విద్యా సంవత్సరం ఇంటర్మీడియట్ 60 శాతం మార్కులతో ఉత్తీర్ణులైన వారు ఈ జాబ్ మేళాకు హాజరు కావచ్చ అని గురవయ్య తెలిపారు.ఆన్‌లైన్ ద్వారా కెరీర్ ఆప్టిట్యూడ్ ( career aptitude) పరీక్ష నిర్వహిస్తున్నట్లు తెలిపారు. దీనికి సంబంధించిన క్వాంటిటేటివ్ (quantitative) 10 మార్కులు, లాజికల్ రీజనింగ్( Logical Reasoning) 10 మార్కులు, వెర్బల్ ( Verbal) 10 మార్కులు ఉంటాయన్నారు. పైన తెలుపబడిన ప్రతి ఒక్క విభాగం నుంచి కనీసం నాలుగు(4) మార్కులు సాధించిన విద్యార్థులకు ఆ తర్వాత నిర్దేశిత అంశంపై వ్యాసరచన ఉంటుందన్నారు.ఇందులో ఉత్తీర్ణులైన వారికి హెచ్.సి. ఎల్ (HCL)కంపెనీ ఏడాదిపాటు ఇంటర్న్షిప్ కల్పించి తదుపరి ఉద్యోగ అవకాశం కల్పిస్తుంది అన్నారు. దీనితో పాటు బిట్స్ పిలాని (BITS-PILANI) లో ఉన్నత చదువులు చదువుకోవడానికి అవకాశం కల్పిస్తుంది గురవయ్య అన్నారు. ఈ అవకాశాన్ని జిల్లాలోని ఇంటర్ పూర్తి చేసిన విద్యార్థిని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు తెలిపారు.ఏమేం తీసుకెళ్లాలంటే..! ఈ జాబ్ మేళా (Job Mela) కు హాజరయ్యే విద్యార్థులు పదో తరగతి మార్క్ లిస్టు ( SSC Mark List), మరియు ఇంటర్ మార్క్ లిస్ట్ (Inter Mark List), ఆధార్ కార్డు జిరాక్స్ కాపీలు (Aadhar card Zerox), రెండు సెట్లు మరియు పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోను తీసుకురావాలని అధికారులు సూచించారు. అడ్రస్: జి.పుల్లారెడ్డి ఇంజనీరింగ్ కళాశాల, నంద్యాల రోడ్డు, బి.తాండ్రపాడు, కర్నూలు, ఆంధ్రప్రదేశ్- 518001
0 comments:
Post a Comment